Scheme: ఈ స్కీమ్‌లో రూ.55 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.3 వేల పెన్షన్.. ఎలాగంటే?

Scheme: కష్టపడిన సమయంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వయస్సు మీరిన తర్వాత హ్యాపీగా కూర్చోని తినవచ్చు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసినా కూడా భవిష్యత్తులో పెన్షన్ రూపంలో ప్రతీ నెలా కూడా వస్తాయి. కష్టపడిన వయస్సులో కాస్త సంపాదించి సేవ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వయస్సు పెరిగిన తర్వాత ఆర్థిక సమస్యలు లేకుండా ఉండవచ్చు. అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగస్థులకు అయితే పదవి విరమణ తర్వాత కూడా పెన్షన్ వస్తుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగస్థులకు అయితే రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పెన్షన్ వంటివి ఉండవు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అందులో ఇది ఒక పథకం. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో పెన్షన్ కూడా వస్తుంది. మరి దీని పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ స్కీమ్ ప్రారంభమైంది. అయితే వృద్ధాప్యంలో కార్మికులకు నెలకు రూ. 3,000 వరకు ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ ఇస్తారు. తక్కువ ఆదాయం ఉన్నా కూడా డబ్బులు పొందవచ్చు. అయితే అందరికీ కాకుండా కొందరు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వీరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఆదాయం అనేది నెలకు రూ.15 వేలు కంటే ఎక్కువగా ఉండకూడదు. వీధి వ్యాపారులు, డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ సహాయకులు వంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్థులు అయితే దీనికి అర్హులు కారు.
కొంత మొత్తంలో ప్రతీ నెల కట్టడం వల్ల పెన్షన్ వస్తుంది. అంటే నెలకు రూ.100 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.100 జమ చేస్తుంది. ఇలా మొత్తం పెన్షన్ అకౌంట్‌లో రూ.200 అవుతుంది. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాలి. అయితే ఎంత చెల్లించాలనేది వయస్సును బట్టి ఉంటుంది. ఈ పథకంలో 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.55 చెల్లించాలి. అదే 29 ఏళ్ల వయస్సులో నెలకు రూ.100 చెల్లించాలి. ఒకవేళ 40 ఏళ్ల వయస్సులో అయితే నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా చేయడం వల్ల పెన్షన్ వస్తుంది. నెలకు రూ.3 వేల వరకు ఇస్తారు. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం LIC, CSC ద్వారా నిర్వహిస్తోంది. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల వయస్సు పెరిగిన తర్వాత బాగుంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.
Also read: SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
-
Post Office Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. రూ.36 సేవ్ చేస్తే.. రూ.6 లక్షలు.. ఎలాగంటే?
-
Chanakyaniti: డబ్బు సంపాదించడం కాదు.. పొదుపు ముఖ్యం.. చాణక్యుడు చెప్పే సూత్రాలివే
-
LIC: ఒక్కసారి కడితే జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ న్యూ స్కీమ్
-
SIP: సిప్‌లో నెలకు వెయ్యి ఇన్వెస్ట్ చేస్తే.. కోట్లలో డబ్బు మీ సొంతం
-
LIC: ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీతో.. భవిష్యత్తులో కూతురు పెళ్లికి ఇక నో టెన్షన్