SIP: సిప్‌లో నెలకు వెయ్యి ఇన్వెస్ట్ చేస్తే.. కోట్లలో డబ్బు మీ సొంతం

SIP: డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో.. వాటిని సేవ్ చేసుకోవడం అంత కంటే కష్టం. చాలా మంది డబ్బును పెంచుకోవడానికి కొన్ని విధానాలు పాటిస్తుంటారు. డబ్బును సేవ్ చేసుకోవడానికి కొన్నింట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల సులభంగా లాభాలు వస్తాయని భావిస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ మంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉపయోగిస్తారు. ఈ సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు తొందరగా వస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎక్కువగా లాభాలు వస్తాయి. అయితే చాలా మంది వీటిలో ఎక్కువగానే ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే లాభాలు వస్తాయని అనుకుంటారు. కానీ సిప్‌లో తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా దీర్ఘకాలికంగా బోలెడన్నీ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నగా కూడా సిప్‌లో పెట్టుబడి ప్రారంభించి.. ఎన్నో లాభాలు పొందవచ్చు. మీరు సిప్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ బ్యాంకు ఖాతా నుంచి లింక్ పెట్టుకోవచ్చు. ప్రతీ నెలా ఆటోమెటిక్‌గా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. సిప్‌లో పెద్ద మొత్తంలో కంటే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇందులోని ఇన్వెస్ట్ భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. మీరు నెలకు కనీసం వెయ్యి సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. పదవీ విరమణ వచ్చేసరికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో డబ్బులు బాగా ఉపయోగపడతాయి. ప్రతీ నెలా వెయ్యి రూపాయిలను సిప్‌లో పెట్టడం వల్ల దాదాపు రూ.కోటి వరకు లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు మీరు సిప్‌లో నెలకు వెయ్యి రూపాయిలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. మొత్తం 40 ఏళ్ల పాటు ప్రతీ నెల వెయ్యి రూపాయిలు ఇన్వెస్ట్ చేయండి. వార్షిక రాబడి అంచనాగా 12 శాతం అనుకోండి. మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.4.80 లక్షలు. దీనికి రాబడి అంచనాగా చూసుకుంటే.. రూ. 1,14,02,420. మీకు ఫైనల్‌గా వచ్చే మొత్తం రూ.1,18,82,420. మీరు ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే.. పదవి వీరమణ సమయానికి కోటికి పైగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సిప్‌లో ఇలా నెలకు తక్కువగా ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. మీరు రిటైర్ అయ్యే సమయానికి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా చేతిలో ఉంటాయి. మీరు వేరే మ్యూచువల్ ఫండ్స్‌లో కాకుండా సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయి. అయితే ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మేలు.