Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఎలా?

Mutual Funds: భవిష్యత్తులో మంచి లాభాలను పొందడానికి చాలా మంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువగా లాభాలు వస్తాయి. కేవలం ఎక్కువ మొత్తంలోనే కాకుండా తక్కువ మొత్తంలో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనివల్ల ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతారు. అయితే చాలా మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు తప్పుడు కారణాల వల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలను ఎంచుకుంటారు. ఉదాహరణకు, ఒక సంవత్సరం రాబడి ఆధారంగా ఈక్విటీ పథకంలోకి చాలా మంది క్లయింట్లు దూసుకుపోతుంటారు. దీనివల్ల కొన్నిసార్లు నష్టపోతారు. ఎందుకంటే స్వల్పకాలిక పనితీరు సాధారణంగా ఒకటి లేదా రెండు ఆల్ఫా-జనరేటింగ్ స్టాక్ ఎంపికల ఫలితం, సాధారణంగా దీర్ఘకాలిక భవిష్యత్తులోకి విస్తరించదు. అదేవిధంగా పోర్టల్‌లు లేదా జారీచేసేవారు అందించే ‘స్టార్ రేటింగ్’ ఆధారంగా పూర్తిగా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకుంటారు. అయితే మీరు అన్ని మార్కెట్ల ట్రాక్ రికార్డులను చెక్ చేసి తీసుకోవాలి. తక్కువ కాకుండా మూడు, ఐదు, పదేళ్లకు ఇలా ఎంత రాబడి వచ్చిందని గుర్తించాలి. ఆ తర్వాతే మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను తీసుకోవాలి.
పెట్టుబడిదారుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రమోటర్ల ఆధారాలను తనిఖీ చేయాలి. స్థిరపడిన, ప్రొఫెషనల్ కంపెనీలు మీ డబ్బు సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి, మార్కెట్ కదలికల నుండి ప్రయోజనం పొందేందుకు మంచి స్థితిలో ఉండేలా మంచి విధానాలు, పెట్టుబడి అనుభవాన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే పోర్ట్‌ఫోలియో/ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్, దీర్ఘకాల వ్యవధిలో మార్కెట్ చక్రాలను విజయవంతంగా నావిగేట్ చేయాలి. పెట్టుబడి లక్ష్య ఆదేశానికి కట్టుబడి ఉండే నిధి సామర్థ్యాన్ని తనిఖీ చేయండి. ఏ మ్యూచువల్ ఫండ్స్‌కి అయితే ఎక్కువగా రిటర్న్స్ వస్తున్నాయో వాటినే తీసుకోండి. అయితే మోతీలాల్ మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా లాభాలు వస్తాయి. దీనివల్ల మీకు ఎక్కువ రాబడి వస్తుంది. ఇందులో సగటున 29.59 శాతం వరకు రాబడి వస్తుందట. అంటే మీరు ప్రతీ నెల ఒక రూ.10 వేలు సిప్ చేశారనుకోండి. అప్పుడు ఐదేళ్లకు రూ.12.17 లక్షలు వస్తాయి. ఇలా మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా మిగతా వాటితో పోలిస్తే ఎంత వస్తుందని ఆలోచించి తీసుకోవాలి. అప్పుడే మీకు మంచి లాభాలు ఉంటాయి. లేకపోతే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా నష్టపోతారు. సరైన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం వల్ల మీరు భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. లేకపోతే మాత్రం తక్కువ సమయాల్లోనే నష్టపోతారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అసలు లాభాలను ఇవ్వదు. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా లాభాలు ఎందులో ఉంటాయనే విషయం చూసి వాటిని ఎంచుకోవడం ముఖ్యం.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Post Office Scheme: బెస్ట్ స్కీమ్ భయ్యా.. రూ.100 డిపాజిట్ చేస్తే లక్షలు
-
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో కోటీశ్వరులు మీరే
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
-
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ది బెస్ట్ ఇదే
-
Business: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ.. ఈ వ్యాపారాలు చేస్తే కోటీశ్వరులు మీరే