Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ది బెస్ట్ ఇదే

Mutual Funds: డబ్బులు ఆదా చేసుకోవాలని చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వచ్చిన జీతంలో ఇలా డబ్బులు ఆదా చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీటిపై అనుభవం లేని వారు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఈజీగా ఇన్వెస్ట్ చేయవచ్చు. సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఎక్కువ మొత్తంలోనే కాకుండా తక్కువ మొత్తంలో కూడా సిప్‌లో లాభాలు వస్తాయి. వీటిలో తక్కువ పెట్టుబడితో కూడా బాగా లాభాలు వస్తాయి.
మీకు నెలకు వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు ఎక్కువ లేదా తక్కువలో పెట్టుకోవచ్చు. చాలా మందికి వచ్చిన జీతం సరిపోక ఎలాంటి పెట్టుబడులు పెట్టలేకపోతుంటారు. అలాంటి వారు కూడా సిప్‌లో తక్కువ బడ్జెట్‌కే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఉన్న బడ్జెట్ బట్టి మీరు సిప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే సిప్‌లో మూడు లేదా ఆరు నెలలు ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు డబ్బులు సమస్యగా ఉంటే కొన్ని రోజులు ఆపేయవచ్చు. తక్కువ బడ్జెట్‌తో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లా్న్. ఎందుకంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు తక్కువ డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తే.. లాస్ అయినా పెద్ద ప్రమాదం ఉండదు. తక్కువ పెట్టుబడి మీద కూడా ఇందులో బాగా రిటర్న్స్ వస్తాయి. దాదాపుగా 12% ఆవరేజ్ రాబడి వస్తుంది. సిప్‌లో తక్కువ కంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.
సిప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీకు లాభాలు వస్తాయి. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు మీరు తక్కువ యూనిట్లకే కొనవచ్చు. మనలో చాలా మందికి ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియదు. వీటిలో సిప్‌లోనే ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మందికి తెలియక వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఉదాహరణకు మీకు నెలకు అన్ని ఖర్చులు పోయిన తర్వాత రూ.1000 మిగిలినా కూడా సిప్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సామాన్యులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు దీర్ఘకాలికంగా లాభాలు పొందుతారు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే నష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. అదే తక్కువ బడ్జెట్‌లో ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.