Post Office Scheme: బెస్ట్ స్కీమ్ భయ్యా.. రూ.100 డిపాజిట్ చేస్తే లక్షలు

Post Office Scheme: డబ్బులు ఆదా చేయాలని చాలా స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తక్కువ డబ్బులు అయినా కూడా ఏదో ఒక స్కీమ్‌లో భవిష్యత్తు కోసం డబ్బులు కడుగుతారు. అయితే కొన్ని ఫేక్ స్కీమ్స్ ఉంటాయి. పోస్టాఫీస్‌లో స్కీమ్స్ మంచివి ఉంటాయి. వీటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. తక్కువ బడ్జెట్‌లో కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటివల్ల ఆర్థికంగా బాగుంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పెట్టుబడికి చాలా మంచిది. ఇందులో కేవలం రూ.100 పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో బాగా లక్షల రాబడి వస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అయితే చాలా మందికి ఈ స్కీమ్ గురించి పెద్దగా తెలియదు. అయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి? ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ RD అనేది పొదుపు పథకం. ఇందులో పెట్టుబడిదారులు నెలవారీగా ఒక నిర్ణీత మొత్తాన్ని నిర్ణీత కాలానికి డిపాజిట్ చేస్తారు. అయితే ఈ పథకం ముఖ్యంగా తమ డిపాజిట్లపై పోటీ వడ్డీ రేట్లను బట్టి పొదుపు ఇస్తుంది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని పోస్ట్స్ విభాగం కింద పనిచేస్తుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న సురక్షితమైన పెట్టుబడిలో ఇది ఒకటి. మార్కెట్-లింక్డ్ పెట్టుబడుల మాదిరిగా కాకుండా, పోస్ట్ ఆఫీస్ RD రాబడిని ఇస్తుంది. ఇది ప్రభుత్వ స్కీమ్. దీనికి హామీ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ RD పెట్టుబడిదారులకు గరిష్ట రాబడిని అందించే కాంపౌండ్ వడ్డీ గణన పద్ధతిని ఉపయోగిస్తుంది. వడ్డీని త్రైమాసికానికి ఒకసారి, కాంపౌండ్ చేస్తారు. అంటే మీరు మీ అసలు మొత్తం, గతంలో సంపాదించిన వడ్డీ రెండింటి పైనా వడ్డీని పొందుతారు.
ఇందులో ఖాతా తెరవడం కూడా ఈజీ. పోస్ట్ ఆఫీస్ RD ఖాతాను తెరవడానికి ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఫోటో ID (ఆధార్, పాన్, ఓటరు ID), యుటిలిటీ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలు, నామినేషన్ ఫారం ఉండాలి. సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి అప్లై చేయవచ్చు. లేదా ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా చేయవచ్చు. ఆ తర్వాత అక్కడ అప్లై చేయడం లేదా ఆన్‌లైన్‌లో అయినా చేసుకోవచ్చు. ఇలా పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి. పిల్లల చదువు, పెళ్లి ఇలా ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. ఎక్కువ మొత్తంలో కాదు.. తక్కువ మొత్తంలో పెట్టడం వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు.
ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట
-
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలో కోటీశ్వరులు మీరే
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
-
Investment: మూడేళ్లలో కోటీశ్వరులు కావాలంటే.. వీటిలో ఇన్వెస్ట్ చేయండి
-
Business: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ.. ఈ వ్యాపారాలు చేస్తే కోటీశ్వరులు మీరే