Business: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ.. ఈ వ్యాపారాలు చేస్తే కోటీశ్వరులు మీరే

Business :
ఉద్యోగం కంటే వ్యాపారం చిన్నదైన బెస్ట్ అని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఉద్యోగం అయితే ఒకరి కింద బతకాలి. కానీ వ్యాపారం అయితే ఆ ఇబ్బంది ఉండదు. మనకి నచ్చిన సమయంలో నచ్చినట్లు పనిచేసుకోవచ్చు. ఇతరుల దగ్గర నుంచి ఎలాంటి మాటలు కూడా పడాల్సిన అవసరం లేదు. అయితే కొందరికి వ్యాపారం చేయాలని ఉంటుంది. కానీ వ్యాపారానికి సరిపడా డబ్బులు ఉండవు. దీంతో ఉద్యోగం చేయలేక, వ్యాపారం చేయలేక మధ్యలో నలిగిపోతుంటారు. చిన్న వ్యాపారం అయినా చేసుకుంటే.. హ్యాపీగా ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. తెలివిగా వ్యాపారం చేసే టాలెంట్ ఉండాలి. కానీ ఈజీగా బతకవచ్చు. అయితే తక్కువ బడ్జెట్‌తో మంచి వ్యాపారం చేయాలంటే మాత్రం చాలానే ఉన్నాయి. మరి తక్కువ బడ్జెట్‌తో బెస్ట్ బిజినెస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
తక్కువ బడ్జెట్‌లో మంచి లాభాలు వచ్చే వ్యాపారాన్ని ప్రారంభించాలంటే టైల్స్ వ్యాపారం బాగుంటుంది. ఎందుకంటే పట్టణం లేదా గ్రామాల్లో చిన్నగా తయారు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. మీరు తయారు చేసే టైల్స్ బట్టి లాభాలు వస్తాయి. టైల్స్ తయారు చేసి చిన్నగా పెడితే రూ.50,000 నుంచి రూ.200,000 వరకు ఉంటుంది. అదే మీరు మధ్య తరహాలో ఉత్పత్తి చేయాలంటే రూ.5,00,000 నుంచి రూ.2,000,000 వరకు అవుతుంది. అదే పెద్ద ఎత్తున ఉత్పత్తి అయితే రూ.5,000,000 నుంచి రూ.20,000,000 వరకు చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో పెట్టుకుని, ఆ తర్వాత లాభం వస్తే మీరు ఎంతైనా కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ముందు మీరు రూ.50000 బడ్జెట్‌తో ప్రారంభించండి. ఈ టైల్స్ తయారు చేయడానికి బంకమట్టి, సిరామిక్ పొడి, సిలికా ఇసుక, ఫెల్డ్‌స్పార్, క్వార్ట్జ్, రంగులు, గ్లేజ్‌లు ఉండాలి. వీటి మిశ్రమాన్ని కలిపి టైల్స్ తయారు చేయవచ్చు. అయితే మీరు పలకలను అచ్చులో వేసి తయారు చేసుకోవాలి. మీకు నచ్చిన రంగులతో పలకలను వేసి ఎండలో పెట్టి కాల్చాలి. అంతే ఇక టైల్స్ రెడీ అయినట్లే. ఇలా మీరు తక్కువ బడ్జెట్‌తో తయారు చేసి విక్రయించవచ్చు. అయితే మార్కెట్ డిమాండ్‌ను బట్టి లాభాలు ఉంటాయి. మీరు పెట్టే బడ్జెట్ బట్టి మార్జిన్ ఉంటుంది. అయితే దీనికి మార్కెటింగ్ కూడా ముఖ్యమే. మీరు సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగం చేసుకోండి. దీనివల్ల మీరు ఒకరి కింద జీవించాల్సిన అవసరం ఉండదు.