LIC: ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీతో.. భవిష్యత్తులో కూతురు పెళ్లికి ఇక నో టెన్షన్

LIC: ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు వారికి టెన్షన్. ఎందుకంటే పెళ్లి ఎలా చేయాలని ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఆడపిల్లల చదువు, ఖర్చు ఇలా చూసుకుంటూ పోతే వారికి పెళ్లి అయిన వరకు ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. ఆడపిల్లల పెళ్లి చేయడానికి ఎందరో తల్లిదండ్రులు కూడా అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎల్ఐసీ ఓ ప్లాన్ తీసుకొచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కన్యాదాన్ అనే పాలసీని తీసుకొచ్చింది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ ఎల్ఐసీ కన్యాదన్ పాలసీ అంటే ఏంటి? ఇందులో ఎలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఒక దీర్ఘకాలిక పెట్టుబడి. ఇందులో కుతూరు పెళ్లి కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కూతురు పుట్టినప్పుడు నుంచి పదేళ్ల మధ్యలో డబ్బులు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ ప్లాన్ కింద డబ్బులు వస్తాయి. ఈ పాలసీలో నెల, మూడు నెలలు, ఏడాదికి మెచ్యూరిటీ ప్లాన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.22.5 లక్షల వరకు ఒక్కసారి డబ్బులు చేతికి అందుతాయి. ఈ పాలసీ వ్యవధి కూడా 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పాలసీ కోసం అప్లై చేసుకోవాలంటే తండ్రి వయస్సు 50 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. అప్పుడే ఈ పథకానికి అర్హులు. ఈ పాలసీని యాక్టివేషన్ చేయించుకున్న తర్వాత మూడేళ్లకు రుణం కూడా తీర్చుకోవచ్చు. అయితే మీరు పాలసీని మధ్యలోనే ఆపేయాలని అనుకుంటే.. ప్రారంభమైన రెండు ఏళ్ల తర్వాత పాలసీని ఆపేయవచ్చు. అలాగే మీరు ఏదో కారణం వల్ల డబ్బులు చెల్లించకపోతే జరిమానా లేకుండా నెల రోజుల లోపు డబ్బుల కట్టవచ్చు.
ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత పాలసీ ప్రీమియం చెల్లింపులను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అలాగే పాలసీ మెచ్యూరిటీ ప్లాన్ మొత్తం కూడా సెక్షన్ 10D కింద పన్ను లేకుండా తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 25 సంవత్సరాలకు పాలసీ తీసుకున్నారని అనుకోండి. మీరు దాదాపుగా 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాలి. అంటే నెలకు సుమారుగా రూ.3,447 చెల్లించాలి. ఒకవేళ పాలసీ ఉంటున్న సమయంలో తండ్రి మరణిస్తే అన్ని ప్రీమియంలు కూడా మాఫీ అయిపోతాయి. పాలసీ మెచ్యూరిటీ ప్లాన్ ఉన్నంత వరకు కుమార్తెకు ప్రతి ఏడాది రూ.1 లక్ష లభిస్తుంది. అదే పాలసీదారు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే..నామినీకి అదనంగా 10 లక్షల రూపాయలను ఎల్ఐసీ చెల్లిస్తుంది.