Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు బంగారం కొనాలా?
Akshaya Tritiya అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభకరంగా భావిస్తారు. ఈ తృతీయ నాడు బంగారం కొంటే సంపద పెరగడంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

Akshaya Tritiya: అక్షయ తృతీయను హిందువులు తప్పకుండా పూజిస్తారు. ఈ అక్షయ తృతీయ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. అయితే తృతీయను శుభకరంగా భావించి.. అన్ని మంచి పనులను కూడా ఈ రోజే ప్రారంభిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను ఈ ఏడాది జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొనే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే తప్పకుండా బంగారం అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయాలా? చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం శుభకరంగా భావిస్తారు. ఈ తృతీయ నాడు బంగారం కొంటే సంపద పెరగడంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే బంగారాన్ని స్థిరత్వానికి చిహ్నమని చెబుతుంటారు. అయితే అక్షయ తృతీయ రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి పుట్టిందట. అంటే వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అయితే అక్షయం అంటే తరిగిపోకుండా ఉండేది. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటారు. ఈ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అలాగే అంతా కూడా శుభ ఫలితాలే జరుగుతాయి. అన్ని విధాలుగా కూడా అంతా మంచే జరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయకూడదని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే బంగారం కొనడం కాకుండా నేడు దానం చేయాలట. కానీ ఇది చివరకు బంగారం కొనాలనే విధంగా మారిపోయింది.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనే స్తోమత అందరికి కూడా ఉండదు. అయితే బంగారం, వెండి కొనలేని వారు పత్తి, వెండి నాణెం, మట్టి కుండను అయినా కూడా కొనవచ్చని పండితులు అంటున్నారు. ఎందుకంటే పత్తిని ఇంట్లో దీపాలకు ఉపయోగిస్తారు. దీన్ని వల్ల ఆర్థికంగా మెరుగుపడతారు. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరుతాయని పండితులు అంటున్నారు. అందుకే అక్షయ తృతీయ నాడు పత్తిని కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అలాగే వెండితో తయారు చేసిన నాణెన్ని కొనడం వల్ల సంపద పెరుగుతుందని అంటున్నారు. సాక్ష్యాత్తూ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని కొందరు నమ్ముతారు. ఇవి కాస్త ఖరీదు అయినా కూడా మట్టి కుండ తక్కువగా ఉంటుంది. దీన్ని అక్షయ తృతీయ నాడు ఇంట్లోకి తెస్తే మంచిది. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. అయితే ఈ మట్టి కుండలో బియ్యం వేసి ఇంట్లో ఉంచితే డబ్బు వృద్ధి చెందుతుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.