Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
హిందు పండుగల్లో అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈ పండుగ రోజు అందరూ కూడా బంగారం కొంటారు. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు.

Akshaya Tritiya: హిందు పండుగల్లో అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈ పండుగ రోజు అందరూ కూడా బంగారం కొంటారు. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ తృతీయ నాడు ఏదైనా పని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే తృతీయ నాడు ఎక్కువగా బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటివల్ల అంతా కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే తృతీయ నాడు కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదట. తెలిసో తెలియక కొన్ని వస్తువులను ఇంటికి తీసుకొస్తే ఇంట్లో సమస్యలు మొదలు అవుతాయని నిపుణులు అంటున్నారు. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
అక్షయ తృతీయ నాడు ఇనుము లేదా అల్యూమినియం వంటి వస్తువులు కొనుగోలు చేయవద్దు. వీటిని కొనడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని అసలు కొని ఇంటికి తీసుకురాకూడదని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు నలుపు రంగు దుస్తులను కూడా కొనకూడదు. వీటివల్ల ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఎక్కువగా సమస్యలు వస్తాయి. అలాగే ఏ పని తలపెట్టినా కూడా జరగదు. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సాధారణంగానే నలుపు వస్తువును అశుభంగా భావిస్తారు. అలాంటిది పవిత్రమైన అక్షయ తృతీయ నాడు నలుపు రంగు దుస్తులను ఇంటికి తీసుకురావడం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వీటిని అసలు కొని ఇంటికి తీసుకురావద్దు. అలాగే అక్షయ తృతీయ నాడు ముళ్ల మొక్కను కూడా ఇంటికి తీసుకురాకూడదు. దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముళ్ల మొక్కను తృతీయ నాడు అసలు కొనకూడదని నిపుణులు అంటున్నారు.
అక్షయ తృతీయ నాడు కలప వస్తువులు అసలు తీసుకురాకూడదని అంటున్నారు. కలప వస్తువులను ఇంటికి తీసుకురావడం ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి కలప వస్తువులను అసలు కొనవద్దు. వీటితో పాటు కత్తి, కొడవలి, సూది వంటి వస్తువులను కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఇవి మనిషిని హింసించేవి. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా కోయడానికి వాడుతారు. అయితే ఇలాంటి వాటిని అక్షయ తృతీయ నాడు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అలాగే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. ఎలాంటి పనిలో అయినా కూడా ఆటంకం ఏర్పడేలా చేస్తుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తృతీయ నాడు అసలు ఇంటికి తీసుకురాకూడదట.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు? ఆరోజు బంగారం కొనాలా?
-
Easter: ఈస్టర్లో కలర్ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి నాడు.. ఇలా పూజిస్తే కోరికలు నెరవేరడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి