Ugadi: కొత్త ఏడాదికి వేటిని దానం చేస్తే మంచిదంటే?

Ugadi:హిందూ పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైనది. తెలుగు వారికి ఈ పండుగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగను తప్పకుండా ప్రతీ ఒక్క హిందువులు జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు నుంచే కొందరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే హిందువుల కొత్త సంవత్సరం ఉగాది చైత్ర మాసంలోని శుక్ల పక్షం మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఎంతో ప్రత్యేకంగా ఈ పండుగను హిందువులు అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. ఉగాది పండుగ రోజు ఏం చేసినా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను ఉగాది రోజు ప్రారంభిస్తారు. కొందరు ఎంతో భక్తితో ఉగాది పండుగను జరుపుకుని ఆ తర్వాత కొన్ని నియమాలు పాటించరు. ఉగాది రోజు పూజ చేసి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే ఉగాది పండుగ రోజు ఏయే వస్తువులు దానం చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఉగాది రోజు పూజ తర్వాత తప్పకుండా కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నీరు దానం చేయాలని పండితులు అంటున్నారు. వేసవిలో చాలా మంది దాహం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. రోడ్డు మీద వెళ్లే ఎందరో బాటసారులు వాటర్ లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఉగాది రోజున ఓ మట్టి కుండ పెట్టి నీరు పెడితే చాలా మంచిది. ఈ చలివేంద్రం వల్ల మీ జీవితం కూడా చల్లగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మనిషి మనుగడకు నీరు చాలా ముఖ్యం. నీరు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. నీరు దానం చేస్తే ఇంట్లో కీర్తీ, సంపద, సంతోషం, ఐశ్వర్యం అన్ని కూడా కలుగుతాయని అంటున్నారు. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు విసనకర్ర కూడా దానం చేయడం వల్ల మంచిదని అంటున్నారు. దీన్ని దానం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే మోక్షం లభించడంతో పాటు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఉగాది రోజు ముఖ్యంగా దానం చేయాల్సిన వాటిలో ఒకటి మామిడి. దీన్ని ఉగాది పచ్చడి కోసం తప్పకుండా వాడుతారు. ఈ మామిడిని ఉగాది పండుగ రోజు దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే అన్నదానం వంటివి చేసినా కూడా మంచిదే. వీటివల్ల ఉన్న సమస్యలు తీరి. అన్నింట్లో కూడా విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. మీకు ఏ దానం చేయడానికి వీలు కుదురుతుందో వాటిని దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Easter: ఈస్టర్లో కలర్ఫుల్ ఎగ్స్ ఎందుకో మీకు తెలుసా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఈ పనులు చేస్తే అదృష్టమే