Holi Celebrations : స్టార్ క్రికెటర్ల హోలీ వేడుకలు.. వీడియో చూశారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో?
Holi Celebrations ఇదిలా ఉండగా ఈ మాజీ క్రికెటర్లు అందరూ కూడా ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ 2025లో ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్లో ఇండియా మాస్టర్స్‌కు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు.

Holi Celebrations : దేశవ్యాప్తంగా హోలీ పండుగలను అందరూ కూడా ఘనంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హోలీ సెలబ్రేషన్స్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేశారు. అయితే భారత జట్టు మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ హోలీ పండుగను మిగతా క్రికెటర్లతో కలిసి ఎంతో ఎంజాయ్ చేశారు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్లతో కలిసి సచిన్ టెండూల్కర్ హోలీ పండుగను జరుపుకున్నారు. యువరాజ్ సింగ్‌ను నిద్ర నుంచి లేపి హోలీ కలర్స్ వాటర్ వేశారు. ఇలా సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్లతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వాటర్ గన్ పట్టుకుని సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్‌తో పాటు యూసుఫ్ పఠాన్‌పై నీళ్లు చల్లాడు. దీంతో పఠాన్ బకెట్ వాటర్‌ను సచిన్ టెండూల్కర్‌పై వేశాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ కూడా సచిన్ టెండూల్కర్‌పై వాటర్ కలర్స్ వేశారు. వీరంతా హోలీని ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్న పిల్లలుగా భలేగా ఎంజాయ్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ మాజీ క్రికెటర్లు అందరూ కూడా ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ 2025లో ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్లో ఇండియా మాస్టర్స్‌కు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 13న జరిగింది. ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ మధ్య ఈ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 94 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. దీంతో సెమీ ఫైనల్స్‌కి చేరింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఇండియా తరఫున ఎక్కువ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో ఒక ఫోర్, 7 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి టీమిండియా 220 పరుగులు చేసింది. ఈ లక్ష్యానికి దిగిన ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. అయితే శ్రీలంక, వెస్టిండీస్ జట్ల నేడు జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్స్‌కి వెళ్తారు. మ్యాచ్ మార్చి 16వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Sachin Tendulkar, Yuvraj Singh and Yusuf Pathan celebrating Holi. 😂👌 pic.twitter.com/PYEaMoNbHV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025
-
Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి
-
Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?
-
Holi Vastu Tips: హోలీ రోజు మీ ఇంట్లో ఇవి ఉంటే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదు
-
Holi: ఈ ఏడాది హోలీ ఎప్పుడు.. ఫిబ్రవరి 13న లేకపోతే 14న?
-
Holi 2025 : హోలీ రోజు ఇలా చేయండి. ఇన్ని రోజులు పడ్డ కష్టాలు తొలిగిపోయి, డబ్బు కొరత కూడా పోతుంది..
-
Holi Festival : ఈ సారి హోలీ ఎప్పుడు? ఈ పండుగ ఒకప్పుడు ఎలా జరిగేది?