Holi: ఈ ఏడాది హోలీ ఎప్పుడు.. ఫిబ్రవరి 13న లేకపోతే 14న?

Holi:
హిందూ సంప్రదాయంలో ప్రతీ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అందులో హోలీ కూడా ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకుంటారు. కులమతాలకు అతీతీంగా ఈ పండుగను అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం హోలీ పండుగను పౌర్ణమి తర్వాత రోజు అనగా.. చైత్ర కృష్ణ ప్రతిపద తిథి నాడు జరుపుకుంటారు. అలాగే హోలికా దహనం ఫాల్గుణ పౌర్ణమి రోజు, భద్రా లేని ముహూర్తంలో రాత్రి సమయంలో జరుగుతుంది. అయితే కొన్ని పండుగలు రెండు తిథుల్లో ఉండటంతో రెండు రోజులు వస్తాయి. అంటే తిథి ఈ రోజు ప్రారంభమై.. తర్వాత రోజు వరకు ఉండటంతో చాలా మంది ఎప్పుడు జరుపుకోవాలని సందేహ పడతారు. కొన్ని పండుగలు ఇలానే రెండు రోజుల్లో వస్తుంటాయి. దీంతో కొందరు తికమక పడుతుంటారు. అలాంటి సమస్యే హోలీ విషయంలో కూడా వచ్చింది. కొందరు హోలీ పండుగ మార్చి 13వ తేదీ అని, మరికొందరు హోలీ పండుగ మార్చి 14వ తేదీ అని అంటున్నారు. అసలు హోళీ పండుగ ఎప్పుడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతీ ఏడాది ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిథి నాడు హోళీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 14వ తేదీన జరుపుకుంటున్నారు. హోలి పౌర్ణమి తిథి మార్చి 13వ తేదీ రాత్రి 12.25 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రోజు అనగా మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలోనే హోలీ పండుగ జరుపుకోవాలి. అయితే హోలికా దహనాన్ని భద్రకాలంలో జరుపుతారు. అంటే మార్చి 13వ తేదీన హోలికా దహనం చేస్తారు. దీని తర్వాత రోజే హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మార్చి 15వ తేదీన కూడా హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మధురలో మార్చి 14వ తేదీనే హోలీ పండుగను జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఘనంగా ఈ హోలీ పండుగను అందరూ కూడా జరుపుకుంటారు. అయితే హోలీ ముందు హోలికా దహనం చేస్తారు. ఈ సమయంలో వారు ఎంతో భక్తితో పూజిస్తారు. ముఖ్యంగా పూజలో అక్షింతలు, గంగాజలం, చందనం, పసుపు, దీపం, మిఠాయిలు వంటివి నైవేద్యంగా పెడతారు. అలాగే పూజ చేసి ఆ తర్వాత పిండి, బెల్లం, కర్పూరం, నువ్వులు, ధూపం, గుగ్గులు, జొన్నలు, నెయ్యి, మామిడి చెక్క, ఆవు పిడకలు వంటివి వేస్తారు. ఇవి వేసిన తర్వాత మొత్తం ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి. ముఖ్యంగా కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
-
Holi Celebrations : స్టార్ క్రికెటర్ల హోలీ వేడుకలు.. వీడియో చూశారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో?
-
Holi 2025 : హోలీ రంగులు వదలట్లేదా? ఈ టిప్స్ పాటించండి
-
Holi: ఇక్కడ రంగులతో కాదు.. బూడిదతో హోలి జరుపుకుంటారట.. ఎక్కడంటే?
-
Holi Colours: హోలీ రంగుల వెనుక ఇన్ని అర్థాలు ఉన్నాయా? అవేంటో మీకు తెలుసా?
-
Holi: హోలీకి తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలివే!
-
Holi: అపోహ Vs వాస్తవాలు: హోలిక దహన్ మన ఆరోగ్యంతో ముడిపడి ఉందా?