Rinku Singh: ఎంపీ రింకూ సింగ్ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్

Rinku Singh: ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌కి వివాహం జరుగుతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో వీరికి పెళ్లి అవుతుందని మరోసారి జోరుగా ప్రచారం సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎంపీ భారత క్రికెటర్ రింకూ సింగ్‌ను నవంబర్ 18న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వారణాసిలోని హోటల్ తాజ్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి ముందుగా ఎంగేజ్‌మెంట్ జూన్ 8న జరగనుంది. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ లక్నోలో జరగనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రియా సరోజ్ యూపీలోని మచ్లిషహర్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈమె మొదటిసారి 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. అయితే సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ సమాజ్‌వాదీ పార్టీలో ముఖ్య నాయకుడు. అయితే ఈ నుంచి ఆయన మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు.
ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?
గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో వీరి పెళ్లిని నిశ్చయించారు. అయితే.. రింకూ సింగ్, ప్రియ సరోజ్ మధ్య ఏడాది కాలంగా పరిచయం ఉందని ప్రియ తండ్రి, ఎమ్మెల్యే అయిన తుపాని సరోజ్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. లక్నోలోని ఒక విలాసవంతమైన హోటల్‌ను వేదికగా ఎంచుకున్నారు. కొంత మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగెజ్‌మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల చిన్న ప్రాయంలోనే ప్రియ సరోజ్ యూపీ మచిలీషహర్ నియోజకవర్గం ఎంపీగా గెలిచింది. ఆమెకు యూపీలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేసింది. రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టులో మంచి ఆటకాడిగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో రింకు సింగ్ ఆడుతున్నాడు. రింకూ సింగ్ మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపుగా రూ.8 నుంచి రూ.9 కోట్లు వరకు ఉంటుంది. అయితే ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రింకూ సింగ్ ఆడాడు. అయితే రూ.13 కోట్లు చెల్లించి అతడిని కోల్‌కతా జట్టు తీసుకుంది.
-
Sreeleela: ఎంగేజ్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన శ్రీ లీల
-
Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?
-
Meena Kumari: పెళ్లి, పిల్లలు, విడాకులు అన్ని 38 ఏళ్లకే.. కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదుగా!
-
CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చెక్ చేయాలా?
-
Couples: దంపతులు ఈ టిప్స్ పాటిస్తే.. 30 ఏళ్ల తర్వాత కూడా హ్యాపీ
-
Marriage: ఇలాంటి వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోవద్దు. లేదంటే జీవితం నరకమే..