Inspirational women: చీరతో వందల మంది ప్రాణాలను కాపాడిన ఓ మహిళ.. ఇంతకీ ఆమె ఎవరంటే?

Inspirational women: Inspirational womenచీరలోని గొప్పతనం తెలుసుకో.. అనే పాట చీర గొప్పతనాన్ని వివరించింది. ఈ పాట మొదటి నుంచి చివరి వరకు చీర గొప్పతనం, ఎలా ఉపయోగపడుతుందనే అన్ని విషయాలు కూడా ఉంటాయి. హిందూ సంప్రదాయంలో చీరకు చాలా ప్రాముఖ్యత ఉంది. చీర ఆడవారి శరీరాన్ని కప్పడమే కాకుండా ఎన్నో ప్రమాదాల నుంచి కూడా కాపాడుతుంది. అయితే ఓ ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకి చెందిన ఓ మహిళ 150 మందికి పైగా రైలు ప్రయాణికులను కాపాడింది. అసలు ఒక మహిళ చీరతో ఎలా ఇంత మంది ప్రయాణికులను కాపాడింది? ఆ స్టోరీ ఏంటనే పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకి చెందిన ఓంవతి అనే మహిళ ఒక రోజు రైల్వే లైన్ నుంచి పనికి వెళ్తుంది. అయితే అక్కడ రైలు పట్టాల దగ్గర పగుళ్లు వచ్చిన విషయాన్ని గుర్తించింది. విరిగిన రైల్వే ట్రాక్ దగ్గర ప్రయాణిస్తే ప్రమాదం జరుగుతుందని భావించి ఆ మహిళ చాలా తెలివిగా ప్రవర్తించింది. రైలు ప్రమాదం నుంచి వారిని కాపాడాలని వెంటనే తన ఎరుపు రంగు చీరను తీసివేసి, సమీపంలోని చెట్టు నుండి కర్రలను తీసుకొని రైల్వే ట్రాక్‌పై ఉంచింది. రైలు ప్రయాణాలకు రెడ్ కలర్ కనిపిస్తే వెంటనే ఆపేయాలి. ఎందుకంటే రెడ్ కలర్ అనేది ప్రమాదాలను సూచిస్తుంది. అయితే అవగఢ్ బ్లాక్‌లోని గులేరియా గ్రామం సమీపంలో జరిగింది. అయితే ఎటా నుంచి తుండ్లాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని గుర్తించి రైలు ఆపాడు. వెంటనే దిగి చూడగా రైలు ట్రాక్ విరిగిపోయి ఉంది. ఆ మహిళ ఆ విషయాన్ని లోకోపైలెట్కి చెప్పగా.. వెంటనే అధికారులకు ఆ విషయం చెప్పి ట్రాక్‌కు మరమ్మతులు చేశారు. ఓంవతి తన సమయస్పూర్తితో వందల మంది ప్రాణాలను కాపాడింది. ఈమెకు అందరూ ప్రశంసంలు తెలిపారు. ఒక మహిళ చీర ఇంత మందిని కాపాడిందంటే ఎంత గొప్ప విషయం.
श्रीमती ओमवती।
सुबह खेत पर काम करने जा रही थीं।
ट्रैक पार करते समय अचानक टूटी पटरी पर नजर पड़ गई।
ट्रेन आने वाली थी, इन्होंने समझदारी दिखाते हुए अपनी लाल रंग की साड़ी को लकड़ियों की मदद से ट्रैक पर खड़ा कर दिया।ट्रेन रोकी गई, पटरी ठीक हुई तब 30 मिनट बाद ट्रेन रवाना हुई।👏 pic.twitter.com/j4SJPTN3kl
— SACHIN KAUSHIK (@upcopsachin) March 31, 2022
మహిళ చీర గొప్పతనం, అందంలోనే కాకుండా ప్రజలను కాపాడటానికి కూడా ఉపయోగపడిందని ఈ వీడియోతో నిజమైంది. ప్రతీ మహిళ కూడా ఇలా అన్ని విషయాల్లో సమయస్ఫూర్తితో ఆలోచించాలి. ప్రతీ ఒక్కరూ ఈమెను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆలోచించి దానికి తగ్గట్లుగా పరిష్కారం ఎంచుకోవాలి. అంతే కానీ భయపడి మధ్యలోనే వదిలేయకూడదని ఈమెను చూస్తే అర్థం అవుతుంది.
ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు