MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం

MS Dhoni Birthday: భారత క్రికెట్ అంటే అందరికీ ముందుగా వినిపించే పేరు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్ కూల్‌ను చూసి చాలా మంది పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటుంటారు. అయితే నేడు మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు. నేడు ధోని తన 44వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ధోని అంటే కూల్, క్రికెట్ గుర్తు రావడంతో పాటు సింప్లిసిటీ కూడా గుర్తు వస్తుంది. సింప్లిసిటీ ఏదైనా మారు పేరు ఉందంటే అది ధోని అని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం. మహేంద్ర సింగ్ ధోని తన 44వ పుట్టిన రోజు వేడుకలను చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. సాధారణంగా పుట్టిన రోజు అంటే చాలా మంది చాలా ఘనంగా జరుపుకుంటారు. కానీ కెప్టెన్ కూల్ మాత్రం చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. రాంచీలోని జెఎస్‌సిఎ స్టేడియంలోని తన సహచరుల సమక్షంలో మహేంద్ర సింగ్ ధోని కేక్ కట్ చేశారు. ఇలా ధోని తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ధోని ఇందులో చాలా సింపుల్ డ్రెస్ ధరించారు. బ్లాక్ స్లీవ్‌లెస్ టీ షర్ట్ ధరించి సింపుల్‌గా తన స్నేహితులతో కేక్ కట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోని పుట్టిన రోజు కూడా ఎంత సింపుల్‌గా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.
MS Dhoni celebrating his 44th Birthday 😍❤️ pic.twitter.com/SYVATE9FUG
— ` (@WorshipDhoni) July 7, 2025
క్రికెట్ చరిత్రలో ధోని పేరు ఎప్పటికీ మారుమోగుతుంది. అయితే మొదట్లో ధోని ఫుట్‌బాల్ కీపర్‌గా స్పోర్ట్స్‌లోకి వచ్చారు. ఆ తర్వాత క్రికెట్ వైపు అడుగులు వేశారట. అయితే ధోని క్రికెట్ చరిత్రలో చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉన్నాయి. 1998లో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ధోని చేరారు. ఇదే తన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ గెలిచారు. ఇక్కడ నుంచి ధోని కెరీర్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అసలు వెనుతిరిగి చూసుకోలేదు. మహేంద్ర సింగ్ ధోని టెస్టు క్రికెట్లో టీమిండియాను ఫస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్లేలా చేశారు. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు సాధించారు. అయితే ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం దేశ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నారు. త్వరలోనే దేశ వాలీ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. మహేంద్ర సింగ్ ధోని పేరు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా ఉంది. ఇందులో చేరిన 11వ భారత క్రికెటర్‌గా ధోని ఉన్నారు. అలాగే ధోనికి 2009లో కెప్టె్న్‌గా టెస్ట్ నంబర్ వన్ ర్యాంకింగ్‌ను సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఎనీ వే హ్యాపీ బర్త్ డే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.
Read Also:Infosys : 46గంటలు దాటి పని చేస్తే ఇన్ఫోసిస్ వార్నింగ్.. నారాయణ మూర్తి మాటలకు భిన్నంగా కంపెనీ పాలసీ
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
Team india captain Subhaman gill: డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన గిల్.. ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా!