Infosys : 46గంటలు దాటి పని చేస్తే ఇన్ఫోసిస్ వార్నింగ్.. నారాయణ మూర్తి మాటలకు భిన్నంగా కంపెనీ పాలసీ

Infosys : కొద్ది నెలల క్రితం ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి యువత వారానికి 70 గంటలకు పైగా పని చేయాలని చెప్పిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు ఆయన మాటలను సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. అయితే, నారాయణ మూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ సంస్థ హెచ్ఆర్ పాలసీ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ పాలసీ ప్రకారం ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారానికి 70 గంటలు కాదు కదా, 50 గంటలు కూడా పని చేయకూడదు. నిబంధనల కంటే ఎక్కువ సమయం పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ విభాగం నుంచి వార్నింగ్ మెసేజ్‌లు కూడా వస్తున్నాయట.
Read Also:APAAR ID : విద్యార్థులందరికీ ఒకే ఐడీ.. APAAR ID అంటే ఏంటి? ఎలా పొందాలి?
ఈ విషయం మీద ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఈ విషయంపై ఒక నివేదిక వచ్చింది. దాని ప్రకారం ఇన్ఫోసిస్‌లో రోజుకు 9 గంటల 15 నిమిషాలు మాత్రమే పని చేయాలి. వారానికి ఐదు రోజులు పని ఉంటుంది. ఇంటి నుండి పని చేస్తున్న ఉద్యోగుల కోసం హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ నిర్దేశించిన స్టాండర్డ్ వర్క్ టైం ఇది. ఈ విషయంపై ఒక ఉద్యోగి ఇచ్చిన సమాచారం ఆధారంగా పత్రిలో ఓ కథనం వచ్చింది. దాని ప్రకారం ఉద్యోగులు ఒక రోజులో 9 గంటల 15 నిమిషాలకు మించి పని చేస్తే, ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ నుండి అలర్ట్ మెసేజ్ వస్తుంది. “మేము రోజుకు 9:15 గంటల చొప్పున వారంలో ఐదు రోజులు పని చేయాలి. ఇంటి నుండి పని చేస్తున్నప్పుడు ఈ సమయం దాటితే మానిటరింగ్ సిస్టమ్ నుంచి అలర్ట్ మెసేజ్ వస్తుంది” అని ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగి చెప్పారు.
Read Also:Saif Ali Khan : 10 ఏళ్ల పోరాటం వృథా.. రూ.15,000కోట్లు నష్టపోయిన దేవర విలన్
ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు నెలకు ఎంత సమయం పని చేస్తున్నారో మానవ వనరుల విభాగం ట్రాక్ చేస్తుంది. నిబంధనల కంటే ఎక్కువ పని చేస్తున్న ఉద్యోగులకు నోటిఫికేషన్లు వెళ్తాయి. అయితే, దీనివల్ల ఓవర్‌టైమ్ పని చేసిన ఉద్యోగులకు ఎటువంటి శిక్ష ఉండదు.. లేదా జీతంలో కోత విధించరు. బదులుగా ఇది ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన హెచ్ఆర్ విభాగం ఇచ్చే ఒక రకమైన సలహా మాత్రమే.