Saif Ali Khan : 10 ఏళ్ల పోరాటం వృథా.. రూ.15,000కోట్లు నష్టపోయిన దేవర విలన్

Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన ఓ నవాబ్ కుటుంబానికి చెందినవారు. ఒకప్పుడు రాజుల వంశానికి చెందినవారు కావడంతో ఇప్పటికీ అభిమానులు ఆయనను ‘నవాబ్’ అనే పిలుస్తారు. ఆయన పటౌడీ కుటుంబం ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటి. ఇప్పటికీ సైఫ్ కుటుంబం ఆధీనంలో వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే, ఇటీవల సైఫ్ అలీ ఖాన్ ఒక భారీ విలువైన ఆస్తిని కోల్పోయారు. దాదాపు 10 సంవత్సరాలుగా జరుగుతున్న చట్టపరమైన పోరాటంలో సైఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నవాబులకు చెందిన భారీ విలువైన ఆస్తి, ఒక రాజభవనం ఉంది. ఈ రాజభవనం యాజమాన్యానికి సంబంధించి గత ఇరవై సంవత్సరాలుగా న్యాయపోరాటం జరుగుతోంది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా వివిధ సందర్భాలలో వేర్వేరు కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, భోపాల్‌లోని దాదాపు రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తి సైఫ్ అలీ ఖాన్ చేజారింది.
Read Also:Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?
1999లో భోపాల్ నవాబ్ ఆస్తికి సంబంధించి రెండు సివిల్ దావాలు దాఖలు చేయబడ్డాయి. ఆస్తి పంపకాలు, యాజమాన్యం, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సరైన లెక్కలను కోరుతూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. 1960లో నవాబ్ హమీదుల్లా ఖాన్ మరణం తర్వాత భోపాల్ ఆస్తి వివాదం మొదలైంది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం, నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆస్తికి ఆయన కుమార్తె మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులందరూ భాగస్వాములుగా పరిగణించాలి అని ఉంది. అయితే, 1962లో ప్రభుత్వం రాసిన లేఖ ప్రకారం.. నవాబ్ హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా సుల్తాన్ మాత్రమే తన తండ్రి ఆస్తికి యజమాని అని ప్రకటించింది. 1949 నాటి విలీన ఒప్పందం ప్రకారం సాజిదా సుల్తాన్‌ను ఏకైక యజమానిగా ప్రకటించారు.
సాజిదా సుల్తాన్ సైఫ్ అలీ ఖాన్ సొంత నాయనమ్మ. అంటే ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తల్లి. సాజిదా సుల్తాన్‌ను నవాబ్ బేగం ఆఫ్ భోపాల్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం, భోపాల్ ఆస్తిని ‘శత్రు ఆస్తి’గా పరిగణించారు. దీనివల్ల సైఫ్ అలీ ఖాన్, అతని తల్లి షర్మిలా ఠాగూర్, సోదరి సోహా అలీ ఖాన్ లకు ఆ ఆస్తిపై ఎలాంటి హక్కు లేకుండా పోయింది. అయితే, సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన మరికొన్ని రాజభవనాలు, వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు ఇంకా ఉన్నాయి. గతంలో కూడా కొన్ని ఆస్తులు కుటుంబం చేజారిన సందర్భాలు ఉన్నాయి.
Read Also:AP: ఏపీలో స్త్రీ నిధిలో భారీ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి