AP: ఏపీలో స్త్రీ నిధిలో భారీ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

AP: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడతారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా చదువుతుంటారు. మరికొందరు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగం టైప్ వస్తే చాలని అనుకుంటారు. ఇలా అనుకునే వారికి ఏపీ స్త్రీ నిధి గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. జిల్లాల్లో అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులకు ఉద్యోగాలను ఇవ్వనుంది. వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను జులై 7వ తేదీ నుంచి స్వీకరిస్తారు. చివరి తేదీ జులై 18. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఫీజు రూ.1000 చెల్లిస్తేనే దరఖాస్తు అవుతుంది. అయితే కేవలం ఆన్లైన్ అంటే.. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మాత్రమే సమర్పించాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగులు 52 సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు 4 నుంచి 10వ తరగతి వరకు ఏపీలో చదివి ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ సమర్పించాలి. అలాగే రెసిడెన్సీ సర్టిఫికెట్‌ను ఎమ్మార్వో ఆఫీసు నుంచి తీసుకుని దానిని సబ్మిట్ చేయాలి. అయితే ఓసీ కేటగిరీ ఉన్నవారికి 55% మార్కులు, బీసీలకు 50% మార్కులు, SC/ST /PWDలు 45% మార్కులు వచ్చి ఉండాలి. దీంతో పాటు పరిజ్ఞానం సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెలకు రూ.25,520 జీతం వస్తుంది. అయితే ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి. ఇవి కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత పోస్టును బట్టి సమయం పెంచుతారు. ఎస్సీ కేటగిరీ ఉన్నవారికి 15శాతం, ఎస్టీ వారికి 6శాతం, బీసీ వారికి 29శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.sthreenidhi.ap.gov.in అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు.
Read Also:Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
SSC CGL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 14,582 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
-
TG CPGET 2025: తెలంగాణ పీజీ ప్రవేశాలు.. CPGET 2025 నోటిఫికేషన్ ఈ వారమే!
-
Jawahar Navodaya Notification: జవహర్ నవోదయ నోటిఫికేషన్ రిలీజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
-
AP Telangana Theaters Closed : ఏపీ, తెలంగాణలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
-
AP: పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నంబర్‌కి వాట్సాప్ చేస్తే హాల్ టికెట్ వచ్చేస్తుంది