Jawahar Navodaya Notification: జవహర్ నవోదయ నోటిఫికేషన్ రిలీజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
చాలా మంది మంచి విద్యాలయాల్లో చదవాలని అనుకుంటారు. అయితే చిన్నప్పుడు ఎంత మంచిగా చదివి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటేనే పెద్ద అయిన తర్వాత మంచి పొజిషన్లో ఉంటారు. అలాంటి వారు చిన్నప్పుడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదవాలని భావిస్తారు.

Jawahar Navodaya Notification: చాలా మంది మంచి విద్యాలయాల్లో చదవాలని అనుకుంటారు. అయితే చిన్నప్పుడు ఎంత మంచిగా చదివి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటేనే పెద్ద అయిన తర్వాత మంచి పొజిషన్లో ఉంటారు. అలాంటి వారు చిన్నప్పుడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదవాలని భావిస్తారు. ఇందులో చదవడం వల్ల మంచి టాలెంటో వస్తుంది. అయితే ఈ జవహర్ నవోదయ ఆరో క్లాసులో విద్యార్ధులను జాయిన్ చేసుకుంటుంది. ఇంటర్ వరకు ఇందులో చదవచ్చు. అయితే ఈ జవహర్ నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. వీటికి జులై 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఐదో తరగతి పూర్తి చేసిన వారు లేదా ఐదో తరగతి చదువుతున్న వారు దీనికి అప్లై చేసుకోవాలి. 2026-27 విద్యా సంవత్సరానికి ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 2 విడతల్లో వీటికి విద్యార్థులను సెలక్ట్ చేసుకుంటారు. అయితే దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు జూలై 29 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
Read Also: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు
ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. అయితే ఈ https://cbseitms.rcil.gov.in/nvs/ లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఆరో తరగతి రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వివరాలతో అకౌంట్లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి.. సబ్మిట్ క్లిక్ చేయాలి. అంతే ఇక అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయినట్లే. అయితే వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. వీటికి పరీక్షలను ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే జమ్మూ కాశ్మీర్‌తో పాటు మరికొన్ని పర్వత ప్రాంతాల్లో 2026 ఏప్రిల్ 11వ తేదీన నిర్వహిస్తారు. అయితే ఈ నవోదయ పరీక్షలను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 80 ప్రశ్నలు ఉండగా.. వీటికి రెండు గంటల సమయం ఇస్తారు. అయితే ఇందులో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు ఇవ్వగా, అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు కూడా ఇస్తారు. అయితే వీటికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండదు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్