Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్
Telangana Rains రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతా ల్లో రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.

Telangana Rains: అవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వకారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతా ల్లో రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 11.18 దౌల్తాబాద్ మండలంలో 10.68, యాలాలలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షానికి పలుచోట్ల వందలాది ఎకరాలు పంటలు నీట మునిగాయి. తాండూరులో తోతట్లు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: తెలంగాణకు ఓ పెను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి