Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
Telangana Rains వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

Telangana Rains: తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు ఈరోజు, గురువారాల్లో సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఈనెల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం జలమయమైంది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్
-
Telangana Rains: తెలంగాణకు ఓ పెను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
Telangana Banakacherla Project: బనకచర్లను పక్కన పెట్టండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ