SSC CGL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 14,582 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

SSC CGL: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్‌ను ఎస్‌ఎస్‌సి తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో దాదాపు 14,582 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం14,582 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు జూన్ 9న ప్రారంభం అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 4. అయితే ఫీజు చెల్లించడానికి జూలై 5 చివరి తేదీ. దరఖాస్తు సవరణలకు జూలై 9 నుంచి జూలై 11 వరకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) – టైర్ 1 ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) – టైర్ 2 డిసెంబర్‌లో నిర్వహిస్తారు.
చాలా పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని ప్రత్యేక పోస్టులైన అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి వాటికి CA/CMA/CS/PG డిగ్రీ/MBA లేదా తత్సమాన అర్హత ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి నిర్దిష్ట విద్య అర్హతలను నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలి. అభ్యర్థుల వయోపరిమితికి సంబంధించి నిర్దిష్ట కటాఫ్ తేదీని ఎస్‌ఎస్‌సి నోటిఫికేషన్‌లో ఉంటుంది. సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయోపరిమితి ఉంటుంది. అయితే పోస్టుల బట్టి మారుతుంది. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు అయితే వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్https://ssc.gov.in/ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ప్రాథమిక వివరాలతో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత, ఎస్‌ఎస్‌సి సిజిఎల్ 2025 దరఖాస్తు ఫారంను పూరించాలి. అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, విద్యార్హత ధ్రువపత్రాలు) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. సాధారణంగా పురుష అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు రుసుము ఉంటుంది. మహిళా అభ్యర్థులకు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు, మాజీ సైనికులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. ఎస్ఎస్‌సి సిజిఎల్ ఎంపిక ప్రక్రియ సాధారణంగా రెండు దశల్లో జరుగుతుంది.
టైర్-1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT)లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT) లో టైర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులు టైర్-2 పరీక్షకు హాజరవుతారు. ఇందులో పేపర్-I (క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, రీజనింగ్ & జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్), పేపర్-II (జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కోసం స్టాటిస్టిక్స్) మరియు పేపర్-III (అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కోసం జనరల్ స్టడీస్ – ఫైనాన్స్ & ఎకనామిక్స్) ఉంటాయి. కొన్ని పోస్టులకు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో వివిధ గ్రూప్ ‘బి’, గ్రూప్ ‘సి’ పోస్టులను భర్తీ చేస్తారు.
ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం
-
Study Tips: జీవితంలో సెటిల్ కావాలంటే.. ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులివే
-
TG CPGET 2025: తెలంగాణ పీజీ ప్రవేశాలు.. CPGET 2025 నోటిఫికేషన్ ఈ వారమే!
-
Jawahar Navodaya Notification: జవహర్ నవోదయ నోటిఫికేషన్ రిలీజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి
-
Tirupathi: బెస్ట్ కాలేజీలో ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా.. ఆలస్యమెందుకు అప్లై చేసేయండి
-
BPNLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు
-
Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.69 వేల జీతం