Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Study Tips After Intermediate Choose Which Group

Study Tips: జీవితంలో సెటిల్ కావాలంటే.. ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులివే

Study Tips: జీవితంలో సెటిల్ కావాలంటే.. ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులివే
  • Edited By: kusuma,
  • Updated on June 11, 2025 / 07:31 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Study Tips: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏం చేయాలని చాలా మందికి తెలియదు. డిగ్రీ చదవాలా? బీటెక్ చదవాలా? లేకపోతే ఏదైనా కోర్సు ఎంచుకోవాలా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. అయితే భవిష్యత్తులో సెటిల్ కావాలంటే ఇంటర్ చాలా ముఖ్యమైనది. అందుకే సరైన కోర్సును ఈ సమయంలో ఎంచుకోవడం చాలా కీలకం. విద్యార్థుల ఇంటర్మీడియట్‌లో వారు ఎంచుకున్న గ్రూప్ ఎం.పి.సి, బై.పి.సి, సి.ఈ.సి, హెచ్.ఈ.సి ఆధారంగా అనేక రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఎం.పి.సి విద్యార్థులకు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
ఎం.పి.సి గ్రూప్ తీసుకున్న విద్యార్థులకు ఎక్కువగా ఇంజనీరింగ్ కోర్సులు ఆకర్షణీయంగా ఉంటాయి. B.Tech/B.E ఉంటుంది. అయితే వీటిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE), మెకానికల్ ఇంజనీరింగ్ (ME), సివిల్ ఇంజనీరింగ్ (CE), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE) వంటి వివిధ బ్రాంచ్‌లు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్, ఆటోమొబైల్, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలలో ఇంజనీర్లకు డిమాండ్ ఉంది. ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా ఇందులో ప్రవేశం లభిస్తుంది.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. ఆ తర్వాత ఎంఎస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు చదివి పరిశోధన లేదా అధ్యాపక వృత్తిలోకి వెళ్లవచ్చు. బ్యాంకింగ్, రైల్వేస్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఈ డిగ్రీ ఉపయోగపడుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ఐదేళ్ల ఈ కోర్సు ఉంటుంది. భవనాల డిజైనింగ్, నిర్మాణ ప్రణాళికపై ఇంట్రెస్ట్ ఉన్నవారు NATA వంటి ప్రవేశ పరీక్షలు రాస్తారు.

బై.పి.సి విద్యార్థులకు (బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
మెడిసిన్ (MBBS) డాక్టర్ కావాలనే లక్ష్యం ఉన్నవారికి బైపీసీ చదవాలి. దీనికి NEET పరీక్ష రాయాలి. ఇందులో దంత వైద్య రంగంపై ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) చేయవచ్చు. దీనికి కూడా NEET అవసరం. ఆయుష్ కోర్సులు ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి భారతీయ వైద్య విధానాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు. వీటికి కూడా NEET ద్వారానే ప్రవేశం లభిస్తుంది. పారామెడికల్ కోర్సులు అనగా బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT), బీ.ఫార్మసీ (బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ) వంటి కోర్సులు మంచి కెరీర్ అవకాశాలను అందిస్తాయి. హాస్పిటల్స్, ల్యాబ్స్, ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలుంటాయి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో బోటనీ, బయోటెక్నాలజీ, జువాలజీ, మైక్రోబయాలజీ, అగ్రికల్చర్ వంటివి ఉంటాయి.

సి.ఈ.సి/హెచ్.ఈ.సి విద్యార్థులకు (కామర్స్/ఆర్ట్స్ గ్రూప్స్)
బీ.కాం (బ్యాచిలర్ ఆఫ్ కామర్స్)లో అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, మేనేజ్‌మెంట్ వంటివి ఉంటాయి. బీ.కామ్ తర్వాత సీఏ (చార్టెడ్ అకౌంటెంట్), సీఎస్ (కంపెనీ సెక్రటరీ), సీఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్) వంటి వృత్తిపరమైన కోర్సులు చేయవచ్చు. బీ.ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)లో తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, జర్నలిజం వంటి సబ్జెక్టులలో బీ.ఏ చేయవచ్చు. తర్వాత ఎం.ఏ చేసి సివిల్ సర్వీసెస్, టీచింగ్, జర్నలిజం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బీబీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) మేనేజ్‌మెంట్ రంగంలోకి వెళ్లాలనుకునే వారికి మంచి కోర్సు. బీబీఏ తర్వాత ఎంబీఏ చేసి కార్పొరేట్ రంగంలో మంచి ఉద్యోగాలు పొందవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ రంగాల వైపు వెళ్లాలని అనుకునే వారు చదువుతారు. తర్వాత ఎంసీఏ చేసి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మారవచ్చు. వీటితో పాటు లా కూడా చదవచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా చేయవచ్చు. వీటికి క్లాట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా లా యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది.

ఇది కూడా చూడండి: Vitamin B12 : విటమిన్ బి12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందా..ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ?

Tag

  • Bipc
  • CEC Groups
  • Degree
  • Engineering
  • Inter
Related News
  • SSC CGL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 14,582 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

  • Tirupathi: బెస్ట్ కాలేజీలో ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా.. ఆలస్యమెందుకు అప్లై చేసేయండి

  • Study Tips: చదివింది గుర్తు ఉండాలంటే.. ఈ దిశలో కూర్చోవాల్సిందే

  • Nasa: నాసాలో చదువుకోవడానికి అర్హతలివే

  • BPNLలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.30 వేలకు పైగా జీతాలు

  • Jobs: ఇంటర్ అర్హతతో కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.69 వేల జీతం

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us