Nasa: నాసాలో చదువుకోవడానికి అర్హతలివే
Nasa: సునీత విలియమ్స్ ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి వచ్చారు. ఈమెతో పాటు బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకున్నారు.

Nasa: సునీత విలియమ్స్ ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి వచ్చారు. ఈమెతో పాటు బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకున్నారు. ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లిన వీరు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీంతో చాలా మంది సునీత విలియమ్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సునీత విలియమ్స్ ఏం చదువుకున్నారు? అసలు నాసాలో చేరడానికి ఆమె ఏం చదివారు? ఎలాంటి అర్హతలు ఉంటే నాసాలో చేరవచ్చో? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉన్నతమైన చదువులు చదవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొన్ని చదువుల గురించి చాలా మందికి తెలియదు. ఈ కారణాల వల్ల పెద్ద పెద్ద చదువుల చదవలేరు. వీరికి చెప్పేవాళ్లు కూడా సరిగ్గా ఉండరు. చాలా మందికి కూడా సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి వెళ్లాలని కలల కంటారు. కానీ ఎలా వెళ్లాలనే విషయం తెలియదు. ఇలా వెళ్లడానికి ఎలాంటి చదువులు చదవాలి? ఎలా చిన్నప్పటి నుంచి చదవాలనే ప్లాన్ అయితే తెలియదు. అయితే నాసాలో చేరాలంటే కొన్ని విద్యార్హతలు, అనుభవం తప్పకుండా ఉండాలి. మీరు ఒక వ్యోమగామి కావాలనుకుంటే తప్పకుండా మీకు మూడేళ్ల అనుభవం ఉండాలి. అలాగే ఏదైనా పైలెట్ ఇన్ కమాండ్ రికార్డు కనీసం 1000 గంటలు అయినా ఉండాలి. వీటితో పాటు అధిక పనితీరు ఉన్న జెట్ విమానాలలో కనీసం 850 గంటల సమయమైన రికార్డు ఉండాలి. వీటితో పాటు కొన్ని విమానాలపై కాస్త అనుభవం కూడా ఉండాలి.
ఒక వ్యోమగామి కావాలనుకుంటే పదవ తరగతి నుంచి ఒక పునాది వేసి ఉండాలి. ఇంటర్‌లో సైన్స్ స్ట్రీమ్ ఫిజిక్స్ చదవాలి. ఆ తర్వాత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథ్స్ చదివి ఉండాలి. లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ అయినా చేసి ఉండాలి. వీటిన్నింటి కంటే ముందుగా అంతరిక్ష శాస్త్రంపై బాగా అవగాహన ఉండాలి. అయితే స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది చేయాలి. దీనికి సంబంధించినది ఇండియాలో కేవలం కేరళలో మాత్రమే ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉంది. వీటిలో చేరాలంటే ఎన్నో దశలు ఉంటాయి. తెలివితో పాటు శారీరకంగా, మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. సునీత విలియన్స్ అమెరికాలో చదువుకున్నారు. యూఎస్ నావల్ అకాడమీ నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ చదివిన ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత యూఎస్ నేవీలో హెలికాప్టర్ పైలట్ కావడానికి శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీని 1995లో పూర్తి చేశారు. అయితే నేవీలో ఉన్నప్పుడే సునీత విలియమ్స్ అంతరిక్ష రంగానికి చెందిన వాటికి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇలా ఆమె వ్యోమగామిగా మారారు.