Astronaut: మహిళలకు అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే?
Astronaut: మహిళలకు సాధారణంగా పీరియడ్స్ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ఇష్టపడతారు.

Astronaut:
మహిళలకు సాధారణంగా పీరియడ్స్ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ఇష్టపడతారు. ఎక్కువ శాతం మంది ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. అలాంటిది భూమి మీద కాకుండా అంతరిక్షంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుంది. అసలు వారు అక్కడ వాతావరణ పరిస్థితులను తట్టు్కోగలరా. కొన్నిసార్లు ఈ అంతరిక్ష ప్రయాణాలు తక్కువ రోజులు ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కు వరోజులు ఉంటాయి. సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల కోసం వెళ్తే తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కిపోవాల్సి వచ్చింది. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు కావాలసినవి మాత్రమే తీసుకెళ్తారు. అలాంటిది ఇన్ని రోజులు అక్కడ ఉండిపోతే పీరియడ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో మహిళలకు ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. ఎక్కువగా కడుపు నొప్పి, తిమ్మిరి, రక్తస్రావం ఇలా సమస్యలు ఉంటాయి. ఏ పని చేసుకోలేరు. అయితే అంతరిక్షంలోకి మహిళలు వెళ్లడం ఇదేమి మొదటిసారి కాదు. 1963లో మొదటిసారిగా వాలెంటీనా టెరిష్కోవా అంతరిక్ష ప్రయాణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 60 మంది మహిళలు ఈ ప్రయాణం చేసి ఉంటారు. అయితే వీరిందరూ కూడా పీరియడ్స్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే చెత్తను డిస్పోజ్ చేయడానికి అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. కానీ పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తాన్ని డిస్పోజ్ చేయడానికి లేదు. ఈ క్రమంలో వారికి అవసరం అయ్యే వాటిని ఒక్కోక్కరి బాడీని అంచనా వేస్తారు. ఎన్ని రోజుల ప్రయాణం, బాడీ గుణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడంటే గర్భనిరోధక మాత్రలు వచ్చాయి. వీటిని వాడటం వల్ల పీరియడ్స్‌ను ఈజీగా పోస్ట్ పోన్ చేయవచ్చు.
చాలా మంది మహిళలు పీరియడ్స్‌ను పోస్ట్ పోన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే అంతరిక్ష ప్రయాణంలో పీరియడ్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే వీరు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. ఒక్కసారి ప్రయాణానికి దాదాపుగా 1100 గర్భనిరోధక మాత్రలు అవసరం అవుతాయి. అయితే ఈ గర్భ నిరోధక మాత్రల వల్ల వీరికి మంచిదే కానీ నష్టాలు లేవట. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. దీంతో ఎముకలు బలహీనం అవుతాయి. అదే గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల అందులోని ఈస్ట్రోజెన్ హెల్ప్ చేస్తుంది. కండరాలు, ఎముకలు బలహీనం కాకుండా చేస్తుంది. అంతరిక్ష ప్రయాణంలో వీటిని వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ప్రతిది కూడా ద్రవ పదార్థంగానే ఉంటూ గాల్లో తేలుతుంది. ఉదాహరణకు మీరు నీరు తాగాలనుకున్నా కూడా అది ద్రవ పదార్థంగా చిన్న బుడగల రూపంలో గాలిలో తేలుతుంది. దాన్ని మనం మింగాలి. తాగకూడదు.
-
Nasa: నాసాలో చదువుకోవడానికి అర్హతలివే
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?
-
Periods : పీరియడ్స్ సమయంలో కాళ్లు నొస్తున్నాయా? ఎందుకు? ఏం చేయాలి?
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో చూసారా?
-
Alzheimer’s: భయపెట్టిస్తున్న అల్జీమర్స్.. మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ.. కారణమేంటి?
-
TG: మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీలో 14236 పోస్టుల భర్తీకి టీజీ సర్కార్ గ్రీన్ సిగ్నల్