Periods: మూడేళ్లుగా ఆగకుండా పీరియడ్స్.. ఓ మహిళకు అరుదైన వ్యాధి
Periods మూడేళ్ల నుంచి ఆగకుండా రక్తస్రావం అవుతుంది. మొదటిలో వారం రోజుల పాటు ఆగకుండా రక్తస్రావం జరిగింది. ఈ క్రమంలో డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. అప్పుడు తిత్తి ఉన్నట్లు గుర్తించారు. అయితే దీన్ని తొలగించినా కూడా ఆమెకు రక్తస్రావం కూడా ఆగలేదు.

Periods: మహిళలకు పీరియడ్స్ అనేవి చాలా ముఖ్యం. ప్రతీ నెలలో వీరికి పీరియడ్స్ అనేవి తప్పనిసరి. అయితే నెలకి ఒకసారి పీరియడ్స్ వస్తేనే మహిళలు ఇబ్బంది పడతారు. మరికొందరికి 15 రోజులకు ఒకసారి కూడా పీరియడ్స్ వస్తాయి. ఇలా 15 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. అయితే ఓ మహిళలకు ఆగకుండా ఏకంగా మూడేళ్ల నుంచి పీరియడ్స్ వస్తున్నాయి. అసలు మూడేళ్లుగా ఆగకుండా రావడానికి కారణం ఏంటి? దీనివల్ల ఆమె పడే ఇబ్బందులు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
మూడేళ్లుగా ఆగకుండా పీరియడ్స్ రావడానికి ఓ కారణం ఉంది. ముఖ్యంగా జీవనశైలి మార్పులు, ఒత్తిడి ఆరోగ్య సమస్యలు, హార్మోన్లు అసమతుల్యత వల్ల కొందరికి ఆగకుండా పీరియడ్స్ వస్తాయి. అయితే వీటితో పాటు ఇప్పుడున్న వారు తీసుకునే మందులు, ఫుడ్ వల్ల పాపీ అనే అమ్మాయికి ఆగకుండా పీరియడ్స్ వచ్చాయి. ఇలా రావడం వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడింది. ఆగకుండా రక్తస్రావం కావడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు చాలా తక్కువ స్థాయికి పడిపోయాయి. దీంతో ఒళ్లంతా కూడా ఒకటే నొప్పులు అని తెలిపింది. ఈ సమస్య కోసం ఎందరో డాక్టర్లను ఆమె కలిసింది. కానీ పరిష్కారం మాత్రం రాలేదు. వైద్యులు ఆమెకు పరీక్షలు కూడా చేశారు. వీటితో పాటు మందులు కూడా ఇచ్చారు. కానీ ఆమె ఆరోగ్యం అసలు కుదట పడలేదు. పాపీ ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఎముకలలో విపరీతమైన నొప్పి, వికారం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంది.
మూడేళ్ల నుంచి ఆగకుండా రక్తస్రావం అవుతుంది. మొదటిలో వారం రోజుల పాటు ఆగకుండా రక్తస్రావం జరిగింది. ఈ క్రమంలో డాక్టర్ దగ్గరకు వెళ్లగా.. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. అప్పుడు తిత్తి ఉన్నట్లు గుర్తించారు. అయితే దీన్ని తొలగించినా కూడా ఆమెకు రక్తస్రావం కూడా ఆగలేదు. వెంటనే మళ్లీ హిస్టోరోస్కోపీ అనే పరీక్ష చేశారు. అయినా కూడా ఫలితం లేకపోయింది. ఈ సమస్య వల్ల నిత్యం పాడ్స్ వాడాల్సి వస్తుంది. మూడేళ్ల నుంచి ఇలా డైలీ ప్యాడ్స్ పెట్టుకోవడం వల్ల మానసికంగా కాస్త ఇబ్బందులు వస్తున్నాయని తెలిపింది. అయితే ఈమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన వ్యాధి ఉందని చివరకు డాక్టర్లు నిర్థారించారు. అంటే గర్భాశయం రెండు గదులుగా విడిపోయి ఉంది. దీనివల్ల ఆగకుండా పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఆమెకు ఈ వ్యాధి పుట్టుక నుంచే ఉంది. అయితే చాలా తక్కువ మంది స్త్రీలలో ఇలాంటి సమస్య కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఆమెకు మెట్రోప్లాస్టీ శస్త్ర చికిత్స. దీని ద్వారా కోత అవసరం లేకుండా చేయవచ్చు. ఈ శస్త్ర చికిత్స తర్వాత ఆమె సమస్య తీరడంతో పాటు గర్భం దాల్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి.
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Blood Pressure: అధిక రక్తపోటు సమస్య ఉందా.. వీటిని తీసుకోండి
-
Pregnant Women: గర్భిణులు పైనాపిల్ తింటే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు