Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
ఉదయం పూట కాఫీ తాగకుండా కొందరి డే అయితే స్టార్ట్ కాదు. కాఫీలోని కెఫిన్ డే అంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొందరు అయితే రోజుకి ఒకసారి కాదు.. రెండు లేదా మూడు సార్లు కూడా కాఫీని తాగుతారు.

Coffee: ఉదయం పూట కాఫీ తాగకుండా కొందరి డే అయితే స్టార్ట్ కాదు. కాఫీలోని కెఫిన్ డే అంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొందరు అయితే రోజుకి ఒకసారి కాదు.. రెండు లేదా మూడు సార్లు కూడా కాఫీని తాగుతారు. కాఫీ వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు కాఫీని ముఖానికి కూడా అప్లై చేస్తారు. ముఖానికి కాఫీ పౌడర్‌ను అప్లై చేయడం వల్ల మెరిసిపోతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి. అయితే కాఫీ వల్ల ఆరోగ్యానికి, ముఖానికే కాదు.. తలకు కూడా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా కాఫీని తలకు అప్లై చేయడం జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణలు అంటున్నారు. అయితే కాఫీ పౌడర్‌ను తలకు ఎలా అప్లై చేస్తే ప్రయోజనాలో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
కాఫీని ఒక పాత్రలో వేసి అందులో నీరు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత కాఫీ పొడిని అందులో చల్లార్చి కాస్త కాటన్ క్లా్త్లో పెట్టి వడకట్టుకోవాలి. దీన్ని తలస్నానం చేసే షాంపూలో అప్లై చేసి తలకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. అయితే దీన్ని అప్లై చేసిన ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మసాజ్ చేయాలి. ఆ తర్వాతే తలను కడగాలి. అయితే కాఫీని తలకు అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. ఇలా చేస్తేనే జుట్టుకు పోషకాలు అంది బాగా పెరుగుతుంది. కాఫీతో తలస్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే రాలిపోయే సమస్య కూడా బాగా తగ్గుతుంది. దీనివల్ల జుట్టు కూడా మెరుస్తుంది. దీనివల్ల జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. చాలా మంది ఈ రోజుల్లో ఎక్కువగా జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు కాఫీ పౌడర్ వాటర్‌తో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కాఫీ కంటే ఆర్గానిక్ కాఫీ పొడిని తలకు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
Read Also: లగ్జరీ కార్ల దిగుమతి సుంకం తగ్గింపు.. హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల ట్యాక్స్ చోరీ
కాఫీ పౌడర్‌ను డైరెక్ట్‌గా తలకు అప్లై చేయకుండా.. హెన్నాలో కూడా కలపవచ్చు. దీనివల్ల జుట్టు బ్లాక్ కలర్లోకి మారుతుంది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, సరిగ్గా నిద్రలేకపోవడం, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఎక్కువగా జట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు కాఫీ పౌడర్‌ను తలకు అప్లై చేయడం వల్ల తీరిపోతాయి. అలాగే జుట్టు కూడా ధృఢంగా పెరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
-
Masala Soda: ఫస్ట్ టైమ్ మసాలా సోడా.. బ్రిటిష్ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వొస్తుంది
-
Joint Problems: ఉప్పుతో ఇలా చేస్తే కీళ్ల సమస్యలన్నీ పరార్
-
Weight Lose: వెయిట్ తగ్గాలని అధికంగా రన్నింగ్ చేస్తే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?