Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా

Health Tips: మనలో చాలా మందికి సీమ చింతకాయ గురించి పెద్దగా తెలియదు. సాధారణ చింత కాయలను కొందరు పచ్చిగా తింటారు. మరికొందరు దీంతో ఎన్నో వంటలు చేసుకుంటారు. అయితే సాధారణ చింత పండు కంటే ఈ సీమ చింతకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చింత కాయలు చాలా అరుదుగా లభ్యమవుతాయి. కానీ ఇందులోని పోషకాలతో నూరేళ్లు వరకు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సీమ చింతకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్
సీమ చింతకాయలను తినడం వల్ల డయాబెటిక్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో యాంటీ హైపర్ గ్లైసెమిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ చింతకాయను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు.
రోగనిరోధక శక్తి
ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు. బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి రోగాల బారిన పడకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం
ఈ చింతకాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ ఆరోగ్యం
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, అతిసారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కడుపులోని వ్యర్థాలు అన్నింటిని కూడా బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత నుంచి ఉపశమనం
ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ పండు బరువును తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో మెయిన్ లీడ్ పోషిస్తుంది.
చర్మ ఆరోగ్యం
సీమ చింతకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెరుస్తుందని నిపుణులు అంటున్నారు. డైలీ ఒకటి లేదా రెండు తినడం వల్ల ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
-
Healthy Soup: డైలీ ఈ సూప్ తాగితే.. ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?