Healthy Soup: డైలీ ఈ సూప్ తాగితే.. ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం

Healthy Soup: అందంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దీనికోసం పోషకాలు ఎక్కువగా ఉంటే ఫుడ్‌ను తీసుకుంటారు. దీనివల్ల అందం పెరగడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే బాడీకి ఇమ్యూనిటీ పవర్ అంది, అందంగా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇవి శరీర ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరిపిస్తాయి. అయితే టమోటా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. దీంతో పాటు బీట్‌రూట్‌ను కలిపి సూప్ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. మరి ఈ రెండింటితో కలిపి సూప్ తయారు చేసుకోవడం ఎలాగో మరి ఈ స్టోరీలో చూద్దాం.
బాగా పండిన టమోటా ముక్కలు, బీట్ రూట్ ముక్కలను బాగా ఉడికించుకోవాలి. వీటిని మిక్సీ కూడా చేసుకోవచ్చు. అయితే దీన్ని ఒక ప్యాన్‌లో వేసుకుని ఇందులో కాస్త కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కాస్త సమయం దాన్ని కలపడం వల్ల మీకు బీట్ రూట్, టమోటాతో ఉన్న సూప్ తయారు అవుతుంది. మీకు ఇంకా ఎక్కువగా ఏమైనా కావాలంటే ఏవైనా ఇందులో ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. మీరు ఎంత చిక్కగా దీన్ని తీసుకుంటారో దాని బట్టి తయారు చేసుకోవాలి. ఇలా డైలీ కాకపోయినా వారంలో ఒక రెండు సార్లు అయినా కూడా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఈ రెండింటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ సి వల్ల చర్మం మెరుస్తుంది. మొటిమలు, మచ్చలు వంటివి రావు. అయితే ఈ సూప్‌ను వర్షా కాలం, చలికాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వేడి సూప్ తాగడం వల్ల బాడీ కూడా వెచ్చగా ఉంటుంది. చలి వల్ల మీకు కాస్త విముక్తి కలుగుతుంది.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
టమోటాతో పాటు బీట్‌రూట్‌లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. బీట్ రూట్‌ను ఇలా సూప్‌లా కాకుండా జ్యూస్‌లా తయారు చేసుకున్నా కూడా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు రాకుండా కాపాడతాయి. బీట్ రూట్ తీసుకోవడం వల్ల బాడీకి తక్షణమే శక్తి లభిస్తుంది. డైలీ దీన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొందరికి వీటిని తినడం అసలు ఇష్టం ఉండదు. అలాంటి వారు ఇలా సూప్ లేదా జ్యూస్ చేసి తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Beetroot: వీరు బీట్‌రూట్ తిన్నారో.. అంతే సంగతులు.. ఇక ప్రాణాలు పైకే!
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు