Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే

Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఫిష్ వెంకట్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను మరో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన కుమార్తె తాజాగా వెల్లడించారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులన్నీ దాతల సహాయంతోనే చెల్లించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం వెంకట్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని, ఆయన పరిస్థితి ఇంకా సీరియస్‌గానే ఉందని డాక్టర్లు చెప్పినట్లు కుమార్తె పేర్కొన్నారు. కిడ్నీ, లివర్తో పాటు శరీరమంతా బ్లడ్ ఇన్‌ఫెక్షన్ అయ్యిందని ఆమె వివరించారు.
ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగా క్షీణించిందని, ప్రస్తుతం ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆయన కుమార్తె తెలిపారు. వైద్యులు తమ తండ్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారని, పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఫిష్ వెంకట్‌కు కిడ్నీలు, లివర్ దెబ్బతినడమే కాకుండా, శరీరమంతా రక్తంలో ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ రకమైన ఇన్‌ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనది కావడంతో వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Read Also:Manjummel Boys : రూ.250కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ హీరో, నిర్మాత సౌబిన్ అరెస్టు
ఆసుపత్రిలో చేరిన అతడి గురించి మీడియా ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చింది. వెంటనే కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి తలెత్తగా.. అందుకు డబ్బుల్లేక లేక కుటుంబం ఇబ్బంది పడుతున్నట్లు కథనాలు వచ్చాయి. ఇండస్ట్రీని నుంచి ఫిష్ వెంకట్‌ను ఎవ్వరూ ఆదుకోవడం లేదంటూ మీడియా పేర్కొంది. ప్రభాస్ అసిస్టెంట్ తమకు కాల్ చేసి సాయానికి ముందుకు వచ్చినట్లు వెంకట్ కుమార్తె ఒక వీడియోలో పేర్కొంది. కానీ తర్వాత ఆ కాల్ ఫేక్ అని, ఫోన్ చేసిన వ్యక్తి ప్రభాస్ పీఏ కాదని తను స్పష్టం చేసింది.
ఇది ఇలా ఉండగా ఫిష్ వెంకట్ చికిత్స ఖర్చును భరించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందకు వచ్చింది. మంత్రి వాకిటి శ్రీహరి ఆసుపత్రికి వెళ్లి వెంకట్ ను పరామర్శించి భరోసా ఇచ్చారు. తక్షణ ఖర్చుల కోసం మంత్రి రూ.లక్ష మొత్తాన్ని వెంకట్ కుటుంబ సభ్యులకు అందించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రితో చికిత్స తీసుకుంటున్నారు.
Read Also:Skincare : వానాకాలంలో స్కిన్ అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నుంచి రక్షించుకునే చిట్కాలివే!
-
Kota Srinivasa Rao: శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ.. విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Pan India Star Prabhas: గొప్ప మనస్సు చాటుకున్న రెబల్ స్టార్.. ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం!
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!