Sleep: నిద్రపోయే ముందు వీటిని తిన్నారో.. మీరు పడుకున్నట్లే ఇక

Sleep: రోజంతా కష్టపడి వచ్చిన తర్వాత రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టకపోతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఈ రోజుల్లో రోజంతా కష్టపడినా కూడా రాత్రికి హాయిగా నిద్రపోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది మొబైల్స్ చూస్తూ ఉంటున్నారు. ఇది ఒక కారణం అయితే పోషకాలు లేని ఫుడ్స్ తీసుకోవడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు నిద్రలేమి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. మరి నిద్రపోయే ముందు అసలు తీసుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వేపుడు ఆహారం
కొందరు బద్దకంగా మారి రాత్రి పూట బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. బాగా వేయించిన పదార్థాలను తింటున్నారు. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. జీర్ణం కాక నిద్ర పట్టదు. మీరు పడుకున్న కూడా కడుపు కాస్త బరువుగా ఉంటుంది. దీంతో మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర పట్టదు. కాబట్టి రాత్రిపూట తినే ముందు అసలు వీటిని తినవద్దని నిపుణులు అంటున్నారు.
బాగా కారం ఉన్న పదార్థాలు
కొందరికి స్పైసీ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. అలాంటి వారు రాత్రిపూట వీటిని తింటుంటారు. అయితే బాగా కారం ఉన్న వాటిని తీసుకోవడం వల్ల అసిడిటీ, గుండె మంట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక మసాలా బాడీని వేడి చేస్తుంది. దీనివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. దీనివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాక్లెట్లు
వీటిలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డార్క్ చాక్లెట్లు తింటే రాత్రిపూట సరిగ్గా నిద్రపడుతుంది. కానీ సాధారణ చాక్లెట్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ఊబకాయం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కెఫిన్
కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలను అధికంగా తీసుకోకూడదు. రాత్రి పూట వీటిని తీసుకోవడం వల్ల అసలు నిద్రపట్టదు. కాఫీ లేదా టీ తీసుకుంటే రాత్రంతా కూడా జాగరం చేస్తారని నిపుణులు అంటున్నారు.
పప్పు, శనగలు
రాత్రిపూట పప్పులు తీసుకోవడం వల్ల అసలు జీర్ణం కాదు. వీటివల్ల రాత్రి సమయాల్లో అసలు నిద్రపట్టదు. కాబట్టి అసలు రాత్రిపూట వీటిని తీసుకోవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Health Tips : మగవాళ్లు ఆరోగ్యానికి 5 ముఖ్యమైన అలవాట్లు.. ఈ సింపుల్ టిప్స్‌తో రోగాలకు చెక్!
-
If you see these in your dream: కలలో ఇవి కనిపిస్తే.. లైఫ్‌లో అదృష్టం అంటే మీదే ఇక
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..
-
Water melon: పుచ్చకాయ తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అంతే మీ సంగతి