Health Tips : మగవాళ్లు ఆరోగ్యానికి 5 ముఖ్యమైన అలవాట్లు.. ఈ సింపుల్ టిప్స్‌తో రోగాలకు చెక్!

Health Tips : ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవితంలో పురుషులు తమ కెరీర్, కుటుంబ బాధ్యతలతో మునిగిపోయి, తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మర్చిపోతుంటారు. ఇంటి బాధ్యతలైనా, ఆఫీసు ఒత్తిడైనా, మగవారు తమ ఆరోగ్యం కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా, ఏదైనా తీవ్రమైన లక్షణాలు కనిపించేంత వరకు వారి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. కానీ, ఆరోగ్యం ఒక్కసారి చెడిపోతే ఎన్ని కోట్లు పెట్టినా మళ్లీ నార్మల్ స్థితికి చేరుకోవడం కష్టం.
35 ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో హార్మోన్ల మార్పులు, మెటబాలిజం తగ్గడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతాయి. చిరాకు, అలసట, బలహీనత, బరువు పెరగడం, ఒత్తిడి, ఏకాగ్రత తగ్గడం వంటివి ఏదో ఒక రోగానికి సంకేతాలు కావచ్చు. కాబట్టి, మీ శరీరం ఇలాంటి సంకేతాలు ఇస్తుంటే, జాగ్రత్తగా ఉండాలి.
చిరాకు, అలసట, బలహీనత, బరువు పెరగడం, ఒత్తిడి లేదా ఏకాగ్రత తగ్గడం – ఇవి కేవలం బిజీ లైఫ్ సిగ్నల్స్ మాత్రమే కావు. మీ లైఫ్ స్టైల్ మార్చు కోవాల్సిన టైం వచ్చిందని సూచిస్తుంటాయి. వయసుతో పాటు మీ ఫిట్‌నెస్ నిలబడాలంటే, కొన్ని అలవాట్లను మార్చుకోవాలి.. కొన్ని అలవాట్లను చేర్చుకోవాలి. సకాలంలో కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోవడం చాలా అవసరం, అవి వయసుతో పాటు మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
Read Also:Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
పురుషులు తప్పనిసరిగా అలవర్చుకోవాల్సిన అలవాట్లు
1. క్రమం తప్పకుండా వ్యాయామం
మొదటి చాలా ముఖ్యమైన అలవాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, జాగింగ్, స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వర్కవుట్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం, కండరాల బలం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఆఫీసులో గంటల తరబడి కూర్చునేవారైతే, ఇది మరింత అవసరం, ఎందుకంటే శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
2. సమయానికి తినడం
రెండో ముఖ్యమైన అలవాటు టైంకు పోష్టికాహారం తీసుకోవడం. చాలా మంది పురుషులు పనిలో బిజీగా ఉండటం వల్ల సమయానికి తినరు.. లేదా అర్జంట్ అని బయటి జంక్ ఫుడ్‌తో కడుపు నింపుకుంటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. మీ రోజును ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే అల్పాహారం తీసుకోవాలి. రోజంతా సరిపడా నీరు త్రాగాలి, కూరగాయలు, పండ్లు, పప్పులు, నట్స్ తప్పుకుండా తినాలి.
3. సరిపడా నిద్రపోవాలి
మూడవ అలవాటు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం. నిద్ర కేవలం విశ్రాంతిని మాత్రమే కాదు, శరీరాన్ని బాగుచేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 7-8 గంటల గాఢ నిద్ర పోవాలి. రాత్రి ఆలస్యంగా మొబైల్ చూడటం లేదా పని చేయడం మీ స్లీప్ క్వాలిటీని దెబ్బతీయవచ్చు.
Read Also:Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
4. ఒత్తిడిని అర్థం చేసుకోవడం
నాల్గవ ముఖ్యమైన అలవాటు ఒత్తిడిని అర్థం చేసుకోవడం. దానిని సరైన పద్ధతిలో మేనేజ్ చేయడం. పురుషులు తరచుగా తమ భావోద్వేగాలను అణచివేస్తారు. దీనివల్ల ఒత్తిడి లోలోపల పెరుగుతూ ఉంటుంది. దీనిని సకాలంలో ఆపకపోతే అది అధిక రక్తపోటు, డిప్రెషన్, గుండె జబ్బులకు దారితీయవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా, అభిరుచులు లేదా మీ ఆత్మీయులతో మాట్లాడే అలవాటు చేసుకోండి.
5. ప్రతేడాది హెల్త్ చెకప్ చేయించుకోవాలి
ఐదవ అత్యంత ముఖ్యమైన అలవాటు ప్రతేడాది హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మీరు ఫిట్‌గా ఉన్నారని భావించినా, కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి. సకాలంలో వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది. అనేక తీవ్రమైన సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఈ 5 అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు.
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Sleep: నిద్రపోయే ముందు వీటిని తిన్నారో.. మీరు పడుకున్నట్లే ఇక
-
Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
-
If you see these in your dream: కలలో ఇవి కనిపిస్తే.. లైఫ్‌లో అదృష్టం అంటే మీదే ఇక
-
Exercise: కూర్చోని ఇలా వ్యాయామం చేశారంటే.. సమస్యలన్నీ మాయం
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు