Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు

Weight loss:
మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది ఎక్కువగా బరువు పెరుగుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ వంటివి తీసుకుంటే బాడీలో కొవ్వు పెరుగుతుంది. ఏ మాత్రం లావుగా అయ్యారని అనిపిస్తే వెంటనే డైట్ పాటిస్తారు. దీనికోసం జిమ్‌కి వెళ్లడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వంటివి చేస్తారు. దీనివల్ల బరువు తగ్గుతారో లేదో తెలియదు. కానీ అనారోగ్య బారిన అయితే పడరు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఎక్కువ మంది ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. మళ్లీ బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఏ చిట్కా చెప్పినా కూడా వెంటనే చేసేస్తారు. అయితే ఈజీగా బరువు తగ్గడానికి తినడం మానేయడం, జిమ్‌కి వెళ్లడం అవసరం లేదు. మీరు డైలీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఆరోగ్యకరమైన ఫుడ్
బరువు తగ్గడానికి చాలా మంది ఆహారం మానేస్తారు. ఇలా చేయడం తగ్గడం కంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఫుడ్‌ను మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, న్యూట్రియంట్స్ వంటి విటమిన్లు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోండి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంగా కూడా మీరు బరువు తగ్గుతారు.
హైడ్రేట్‌గా ఉండండి
వాటర్ ఎక్కువగా తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీరు అనేది తప్పకుండా తాగాలి. అప్పుడే మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే తీపి పదార్థాలకు కాస్త దూరంగా ఉండండి. వీటివల్ల మీరు ఇంకా ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
వ్యాయామం
జిమ్ చేస్తేనే బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తారు. కానీ జిమ్‌కి వెళ్లకుండా వ్యాయామం, యోగా వంటివి చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల బాడీలో ఉన్న కొవ్వు అంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది.
హాయిగా నిద్రపోవాలి
బాడీకి సరిపడా నిద్ర లేకపోయినా కూడా ఈజీగా బరువు పెరుగుతారు. నిద్ర లేకపోతే హార్మోన్ల సమతుల్యత బాగా పాడవుతుంది. దీంతో ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే హాయిగా నిద్రపోవాలి. రోజుకి కనీసం 8 గంటలు తప్పకుండా నిద్రపోతే బరువు తగ్గుతారు.. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఒత్తిడి లేకుండా ఉండండి
ఎక్కువగా ఒత్తిడికి గురైతే మాత్రం బరువు పెరుగుతారు. ఒత్తిడికి గురైతే కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆటోమెటిక్‌గా బరువు పెరుగుతారు. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. అవసరం అయితే యోగా, ధ్యానం వంటివి చేస్తే కాస్త ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్