Stress relief: అందంగా ఉండాలంటే చిట్కాలే కాదు.. ఒత్తిడిని కూడా జయించాల్సిందే

Stress relief: అందంగా ఉండాలని చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ ప్రొడక్ట్స్, ఫుడ్ విషయంలో ఇలా అన్నింట్లో కూడా ఎన్నో టిప్స్ పాటిస్తుంటారు. కానీ అందంగా ఉండాలంటే ఇవి మాత్రమే సరిపోదు. ఒత్తిడి కూడా ఉండకూడదని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా, ముఖానికి ఎన్ని బ్యూటీ క్రీమ్స్ రాసినా కూడా ఒత్తిడి ఉంటే ఉన్న అందమంతా కూడా పోతుంది. ఒత్తిడికి గురి కావడం వల్ల శరీరంలో పెద్ద మొత్తంలో కార్టిసాల్ అనే ఒక ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. ఇది చర్మంపై ఉండే సెబేషియస్ గ్రంథులను ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా పెద్ద మొత్తంలో నూనెలను విడుదల చేస్తాయి. వీటివల్ల ముఖంపై చర్మ గ్రంధులు మూసుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల వయస్సు ఎక్కువగా పెరగడం, కళ్ల కింద నల్లగా మారడం, నిద్ర తక్కువగా ఉండదు. దీనివల్ల ముఖం నల్లగా మారుతుంది. అలాగే ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తాయని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అందం విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి అధికంగా ఉంటే చర్మం పొడి బారిపోవడం, దురద వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Actor Fish Venkatesh: నటుడు ఫిష్ వెంకటేష్ పరిస్థితి ఎలా ఉందంటే.. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదా?
ఒత్తిడి అధికం అయితే మానసిక సమస్యలు వస్తాయి. దీనివల్ల జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. అలాగే ముక్క ముక్కలుగా విరిగిపోతుంది. ఊహించని విధంగా అధిక మొత్తంలో జుట్టు రాలిపోతుంది. చర్మం, జుట్టు కాకుండా శారీరక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందితేనే జుట్టు సమస్యలు రావు. ఒత్తిడికి ఎక్కువగా గురి కాకూడదంటే అసలు ఖాళీగా ఉండకూడదు. ఏదో పని చేస్తూ ఉండటం వల్ల ఎలాంటి ఆలోచనలు కూడా ఉండవు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వీటితో పాటు ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి డార్క్ చాక్లెట్లు, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఒత్తిడి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటితో పాటు వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి కూడా చేయాలని నిపుణులు అంటున్నారు. రోజూ ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఒక అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శారీరక సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. కేవలం బ్యూటీ ప్రొడక్ట్స్ వంటివి మాత్రమే కాకుండా ఇలాంటి చిట్కాలు కూడా పాటించాలని నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?
-
Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
-
Yoga: ఈ యోగాను గర్భిణులు చేస్తే.. వంద శాతం నార్మల్ డెలివరీనే!
-
Yoga: ఏయే సమయాల్లో యోగా చేయకూడదో మీకు తెలుసా?
-
Concentration: ఏకాగ్రత పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యోగాసనాలు వేయండి