Yoga: ఏయే సమయాల్లో యోగా చేయకూడదో మీకు తెలుసా?

Yoga: ప్రతీ ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డైలీ యోగా చేయడం వల్ల యంగ్ లుక్‌లో ఉండటంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఉదయం పూట యోగా చేస్తుంటారు. మరికొందరికి సమయం లేకపోవడం వల్ల సాయంత్రం, రాత్రి సమయాల్లో యోగా చేస్తుంటారు. అయితే యోగా ఆరోగ్యానికి మంచిది కదా.. ఏ సమయంలో చేసినా పర్లేదని కొందరు భావిస్తుంటారు. కానీ యోగాను చేయాల్సిన సమయంలోనే చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే యోగాను ఏ సమయంలో చేయడం ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
ఉదయం పూట యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో యోగా చేయడం వల్ల “ఎండార్ఫిన్స్” విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి, నీరసం, అలసట వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం పూట యోగా చేస్తే రోజంతా కూడా యాక్టి్వ్‌గా ఉంటారు. అలాగే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిదని ఉదయం పూట ఎక్కువగా యోగా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం సమయాల్లో ఎక్కువగా యోగా చేయడం వల్ల త్వరగా అలసిపోతారు. దీంతో మీరు చేసిన యోగాకి ఫలితం కూడా ఉండదు. అయితే కొందరికి ఉదయం పూట యోగా చేయడానికి కుదరదు. ఈ సమయంలో సాయంత్రం పూట యోగా చేయాలని భావిస్తారు. అయితే సాయంత్రం సమయాల్లో కూడా యోగా చేసుకోవచ్చు. ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. సాయంత్రం సమయాల్లో యోగా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి ఉండదు. ఆందోళన తగ్గుతుంది. కానీ లిమిట్‌లో మాత్రమే చేయాలి. అతిగా చేస్తే రాత్రి సమయాల్లో నిద్రపట్టదని నిపుణులు అంటున్నారు.
కొందరికి సమయం లేకపోవడంతో భోజనం చేసిన తర్వాత యోగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. భోజనం చేసిన రెండు లేదా మూడు గంటల తర్వాత మాత్రమే యోగా చేయాలని నిపుణులు అంటున్నారు. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, అసిడిటీ వంటి సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో యోగా ఒకే సమయానికి చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్య
-
Walking Rule: 6-6-6 రూల్ పాటిస్తే.. వందేళ్లు అయిన ఆరోగ్యం మీదే
-
Blood Pressure: హైబీపీని తగ్గించుకోవడం ఎలా అంటే?
-
Early Morning: ఉదయం ఈ తప్పులు చేస్తే.. సంపద గోవిందా
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు
-
Yoga : వీటిని గుర్తు పెట్టుకోకపోతే యోగా చేయడం వేస్ట్..ప్రయోజనం ఉండదు..