Walking Rule: 6-6-6 రూల్ పాటిస్తే.. వందేళ్లు అయిన ఆరోగ్యం మీదే

Walking Rule: ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చి తొందరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటుంటారు. ఎవరైతే ఎక్కువగా వ్యాయామం చేస్తారో వారు ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే వ్యాయామం చేయడానికి కొందరికి సమయం ఉండదు. దీంతో పూర్తిగా వ్యాయామం చేయరు. అయితే వ్యాయామం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని రూల్స్ పాటిస్తే మాత్రం వందేళ్లు అయినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. 6-6-6 వాకింగ్ రూల్ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఈ వాకింగ్ రూల్ ఏంటి? ఎలా పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారో ఈ స్టోరీలో చూద్దాం.
ఉదయం 6 గంటలకు నడవాలి
ఉదయం పూట సూర్యరశ్మిలో నడవడం వల్ల మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. తెల్లవారుజామున స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రశాంతమైన ఉదయపు వాతావరణం ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసులోని గందరగోళాన్ని తొలగిస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇంట్లో నడవడం కంటే బయట కనీసం ఒక 20 నిమిషాల పాటు నడవడం వల్ల ఎక్కువ శక్తి, ఉత్సాహం లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఉదయం నడక మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
సాయంత్రం 6 గంటలకు నడవాలి
రోజంతా కష్టపడి సాయంత్రం 6 గంటలకు నడవడం వల్ల విశ్రాంతి పొందడానికి బాగుంటుంది. రోజంతా కూర్చుని పనిచేసే వారికి ఇది మరింత సహాయపడుతుంది. సాయంత్రం నడక వల్ల శారీరక, మానసిక అలసట తగ్గడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరగడం గణనీయంగా తగ్గుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం రాకుండా నివారించడానికి చాలా ఉపయోగపడుతుంది.
రోజుకు కనీసం 60 నిమిషాలు నడవాలి
మీరు ఉదయం నడిచినా, సాయంత్రం నడిచినా, లేదా రెండు పూటలా కలిపి నడిచినా, రోజుకు కనీసం 60 నిమిషాలు నడవడం ఈ రొటీన్‌లో కీలకం. క్రమం తప్పకుండా 60 నిమిషాలు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తపోటు తగ్గడంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. డైలీ తప్పకుండా ఈ రూల్‌ను పాటించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Lethargy: తీవ్ర అలసట ఇబ్బంది పెడుతుందా.. ఇవి తినడం మరిచిపోవద్దు
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!