Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!

Cancer : క్యాన్సర్ అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది పొగాకు వాడకం లేదా మద్యం తాగడం. కానీ, ఈరోజుల్లో మన జీవనశైలి పూర్తిగా మారిపోవడం, సరిగా తినకపోవడం వల్ల చాలా మామూలుగా కనిపించే కామన్ ప్రాబ్లమ్స్. ముఖ్యంగా మాటిమాటికీ గ్యాస్ రావడం, మలబద్ధకం కూడా మన శరీరంలో పెద్ద పెద్ద రోగాలకు కారణం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గ్యాస్, మలబద్ధకం అనేవి చాలా సాధారణ సమస్యలు. దాదాపు అందరికీ వస్తాయి. కానీ, ఇవి ఎక్కువ కాలం ఉండిపోతే.. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే, అది కేవలం అరుగుదల సమస్య మాత్రమే కాదు. ఇది ఏదో పెద్ద రోగానికి సంకేతం కావచ్చని అంటున్నారు. సైంటిఫిక్ , మెడికల్ రీసెర్చ్‌లు ఏం చెబుతున్నాయంటే.. మలబద్ధకం, తరచుగా గ్యాస్ రావడం వంటివి కోలన్ క్యాన్సర్‌కు లేదా పొట్టకు సంబంధించిన ఇతర క్యాన్సర్లకు కారణం కావచ్చట. ఇది వినడానికి భయంగా ఉన్నా, ఇది నిజం!
తిన్న ఆహారం సరిగా అరగక, పేగులు సమయానికి శుభ్రం కాకపోతే.. అంటే మలబద్ధకం సమస్య ఎక్కువ కాలం ఉండిపోతే విష పదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లవు. అవి పేగుల్లోనే పేరుకుపోవడం మొదలవుతాయి. ఈ విష పదార్థాలు నెమ్మదిగా పేగు గోడలను పాడు చేస్తాయి. దీనివల్ల కణాల్లో మార్పులు వచ్చి, అవి చివరికి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంది. అలాగే, మాటిమాటికీ గ్యాస్ రావడం, తేన్పులు రావడం, లేదా పొట్ట ఉబ్బరంగా ఉండటం కూడా జీర్ణప్రక్రియ సరిగా పని చేయట్లేదని అర్థం. ఇది కూడా పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు.
Read Also:Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు
గ్యాస్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు.. ప్రాసెస్డ్ ఫుడ్స్, వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉన్నవి తినడం. అలాగే, ఎక్కువసేపు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండటం, మాటిమాటికీ టీ, కాఫీలు ఎక్కువగా తాగడం. ఈ అలవాట్లు మన పొట్టలో అరుగుదలకు సాయపడే ఎంజైమ్‌లను బలహీనపరుస్తాయి. దీనివల్ల పొట్టలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా ఎక్కువ కాలం జరిగితే, గ్యాస్ట్రిక్ అల్సర్, యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలు వచ్చి, చివరికి క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు దారి తీయొచ్చు.
కోలన్ క్యాన్సర్ ఉన్నవాళ్లలో మొదట్లో మామూలుగా కనిపించే లక్షణాలు ఉంటాయట. ఎక్కువ కాలం పొట్ట బరువుగా ఉండటం, తరచుగా మలబద్ధకం, ఆకలి లేకపోవడం, త్వరగా అలసిపోవడం. ఈ లక్షణాలను మనం చాలా సార్లు పట్టించుకోం. అవి కనిపించిన వెంటనే డాక్టర్ ను కలిసి చూపించుకోవాలి. క్యాన్సర్ లాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. నీళ్లు బాగా తాగాలి, పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి (పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు), సమయానికి తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, నూనెలో వేయించినవి, మసాలాలు ఎక్కువగా ఉన్నవి తినడం తగ్గించాలి.
Read Also:Zodiac Signs: కేతువు మార్పు.. ఈ రాశులు వారికి పట్టనున్న అదృష్టం
-
Mango : శృంగారంపై ఆసక్తిని పెంచే ఈ పండు గురించి తెలుసా?
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!