Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!

Biryani With Drink: కొందరికీ బిర్యానీ లేకపోతే అసలు ముద్ద దిగదు. వెజ్ కంటే నాన్‌వెజ్‌ను అధికంగా తింటారు. రోజులో మూడు పూటలు కూడా బిర్యానీ పెడితే తినేస్తారు. అంత ఇష్టం. ఇప్పుడున్న రోజుల్లో అయితే అందరూ బిజీ లైఫ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది రాత్రి, పగలు తేడా లేకుండా బిర్యానీ తింటున్నారు. ఒకప్పుుడు బిర్యానీ అంటే చేసుకోవడానికి సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ సమస్య అక్కర్లేదు. ఎందుకంటే ఆర్డర్ పెట్టుకుంటే చాలు.. కొన్ని నిమిషాల్లోనే బిర్యానీ మన డోర్ ముందు ఉంటుంది. అయితే బిర్యానీ తిన్న తర్వాత కొందరికి జీర్ణం కాదు. అలాగే బాడీకి కూడా వేడి చేస్తుంది. అయితే బిర్యానీ తిన్న తర్వాత ఈజీగా జీర్ణం కావాలని చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ తాగుతుంటారు. ముఖ్యంగా కోక్ వంటి గ్యాస్ ఉండే డ్రింక్‌లను చాలా మంది తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల తొందరగా తిన్న బిర్యానీ జీర్ణం అవుతుందని, ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవని అనుకుంటారు. మీరు కూడా ఇలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బిర్యానీతో సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే జీర్ణం కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే బిర్యానీతో పాటు కానీ, బిర్యానీ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మరి ఈ స్టోరీలో చూద్దాం.
Read Also:Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
బిర్యానీతో పాటు డ్రింక్స్ తాగితే ఇంకా జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. తిన్న ఫుడ్ జీర్ణం అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు బిర్యానీతో డ్రింక్స్ తీసుకోకూడదు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇలా బిర్యానీతో అసలు డ్రింక్స్ తీసుకోవద్దు. వీటివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొన్ని సార్లు ఫుడ్ కూడా పాయిజన్ అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సాఫ్ట్ డ్రింక్స్‌ను బిర్యానీతోనే కాకుండా ఎప్పుడూ కూడా తాగకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక మొత్తంలో వీటిని తీసుకుంటే ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు అయితే అసలు వీటిని ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు. బిర్యానీతో వీటి కంటే జీరా వాటర్, మజ్జిగ వంటివి తీసుకుంటే బెటర్. వీటిని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుని అసలు అనారోగ్యం పాడుచేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!