Health Issues: ఆరోగ్యానికి మంచిదని ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇలా చేశారో.. అంతే సంగతులు

Health Issues: ఈ సీజన్‌లో లభ్యమయ్యే నేరేడు పండ్లను చాలా మంది ఇష్టపడతారు. ఇవి తినడానికి కాస్త తీపి, పులుపు కలిసి ఉంటాయి. నల్లగా ఉండే ఇవి బెర్రీ జాతికి చెందినవి. వీటిని డైలీ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చాలా మంది తింటుంటారు. కేవలం ఇవి ఈ సీజన్‌లోనే లభ్యమవుతాయి. ఇందులో తక్కువగానే చక్కెర ఉంటుంది. దీనివల్ల మధుమేహం ఉన్నవారికి ఈ నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ బెర్రీస్ తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వీటి వల్ల జీర్ణ సమస్యలు కూడా క్లియర్ అవుతాయని చెబుతున్నారు. అయితే కొందరికి తెలియక ఈ నేరేడు పండ్లు తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను తింటుంటారు. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటిని తిన్న తర్వాత తెలిసో తెలియక కొన్ని పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కూడా అందవని నిపుణులు చెబుతున్నారు. అయితే నేరేడు పండ్లు తిన్న తర్వాత ఏవేవి తినకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
జామ కాయలు
వీటిని సాధారణంగా తినడం ఆరోగ్యానికి మంచివే. కానీ నేరేడు పండ్లు తిన్న తర్వాత అయితే అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా జామ కాయల్లో విటమిన్ సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. అసలు నేరేడు పండ్లు తిన్న వెంటనే తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
పాలు
కొందరు పాలతో నేరేడు పండ్లు షేక్ చేసి తాగుతారు. వీటిని ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు. వీటి కారణంగా గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పాలను కలిపి లేదా తర్వాత కూడా తినకూడదని అంటున్నారు.
ఊరగాయ
కొందరికి ఊరగాయ అంటే ఇష్టం. దీంతో నేరేడు పండ్లు కొందరు కలిపి తింటారు. అయితే ఇలా తినడం వల్ల ఆమ్లం కడుపులో పెరిగిపోతుంది. దీనివల్ల వాంతులు, తల తిరగడం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
పసుపు
బెర్రీ జాతికి సంబంధించిన పండ్లను తీసుకున్న తర్వాత అసలు పసుపు తీసుకోకూడదు. గంట తర్వాత పసుపు తీసుకుంటే పర్లేదు. ఈ రెండింటి కలయిక వల్ల కడుపు నొప్పి, మంట, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
నీరు
సాధారణంగా ఏవైనా తిన్న తర్వాత నీరు తాగడం కామన్. అయితే నేరేడు పండ్లు తిన్న తర్వాత నీరు తాగకూడదని నిపుణులు అంటున్నారు. పొరపాటున తాగడం వల్ల విరేచనాలు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. నేరేడు పండ్లు తిన్న ఒక గంట తర్వాత మాత్రమే నీరు తాగాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!
-
Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
-
Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
-
Banana: ఈ పండు తిన్న తర్వాత ఈ మిస్టేక్స్ చేశారో.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే