Actor Fish Venkatesh: నటుడు ఫిష్ వెంకటేష్ పరిస్థితి ఎలా ఉందంటే.. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదా?

Actor Fish Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో, ఇప్పుడు లివర్ కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంకట్ పరిస్థితి విషమంగా ఉంది. గత మూడు రోజుల నుంచి అయితే అతని పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిష్ వెంకటేష్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా సాయం చేయలేదు. ఫిష్ వెంకటేష్ కుటుంబ సభ్యులు సాయం కోరారు. కానీ ఎవరూ కూడా ముందుకు రాలేదు. ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. కానీ ఎవరూ కూడా ముందుకు రావడంతో బాధ పడుతున్నారు. అయితే కొన్ని రోజులు నుంచి ఫిష్ వెంకటేష్ పరిస్థితి బాగులేక పోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా తీవ్రమైతే వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. తనకు కిడ్నీలు వెంటనే మార్చడానికి ఆపరేషన్‌కు డబ్బులు కావాలని ఫిష్ వెంకట్ కుమార్తె, ఆయన భార్య సాయం కోరారు. కానీ తనకి సరిపడే కిడ్నీలు అయితే దొరకలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉండటంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాయం చేస్తానని ముందుకు వచ్చినట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి తెలిపినట్లు సమాచారం. చికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును భరిస్తానని, సర్జరీ ఎంత వరకు అయితే అంతా కూడా సాయం చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ తెలిపారట. వెంకట్ సర్జరీ కోసం ఇబ్బంది పడవద్దని, కిడ్నీ దొరికితే వెంటనే సర్జరీ చేయమని అండగా ప్రభాస్ నిలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సాయం కోసం తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అది కేవలం ఫేక్ కాల్ ఏమోనని మళ్లీ వార్తలు వచ్చాయి. ప్రభాస్ పేరుతో అలా చేసినట్లు సమాచారం. ఆ ఒక్క కాల్ వారి ఆశలను పెంచింది. కానీ ఆ తర్వాత కనీసం కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి వారి ఆశలు అన్ని కూడా నిరాశ అయ్యాయి. ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒకసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెండు లక్షల రూపాయలు సాయం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వెంకట్ పరిస్థితి విషమించడంతో అతని భార్య, కూతురు సాయం కోరారు. మరి ఇప్పటికైనా టాలీవుడ్ నుంచి ఎవరైనా ఫిష్ వెంకటేష్‌కు సాయం చేస్తారో లేదో చూడాలి.
ఇది కూడా చూడండి: Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్