Setting Limits: హద్దుల్లో ఉంచండి.. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు

Setting Limits: ప్రతీ మనిషికి కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ, తమకంటూ ఒక పర్సన్ ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎవరు ఎంటో తెలియక అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. దీంతో ఎదుటి వారు వాళ్ల హద్దులు దాటి మనకి సజిషన్స్ ఇస్తుంటారు. అయితే సలహాలు ఇవ్వడం మంచిదే. కానీ కొందరు మనం ఎంత మంచి పనులు చేసినా కూడా చెడుగా భావిస్తారు. అలా ఉండు, ఇలా ఉండు, అది చేయకు, ఇది చేయకు అని హద్దులు మీరి సలహాలు ఇస్తారు. దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వారి ఓపినియన్ చెబుతారు. అది మీకు నచ్చకపోతే మీరు మానసికంగా కాస్త టెన్షన్ అవుతారు. అలాగే కాస్త క్లోజ్‌గా ఉన్నారని అన్ని విషయాలు కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు వారికి చెప్పిన సీక్రెట్లు అన్ని కూడా తర్వాత బయటపెట్టే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు ఆ తర్వాత సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరితో అయినా కూడా హద్దుల్లో ఉంటూ, వేరే వాళ్లను కూడా హద్దుల్లోనే ఉంచండి. దీనివల్ల మీకు భవిష్యత్తులో సమస్యలు రావు.
ఇతరులకు మీరు ఏ మాత్రమైనా కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం వారు మీకు అన్ని విషయాలు చెబుతారు. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటారు. ఇలా చేస్తుంటే మాత్రం మొహమాటానికి పోయి.. వారి చెప్పినట్లు వినద్దు. దీనివల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు. ఇతరులకు గౌరవం ఇవ్వండి. వారి మాటను గౌరవించండి. అంతే కానీ వారి చెప్పినట్లు చేయవద్దు. మీకు ఏం అనిపిస్తే అది మాత్రమే చేయండి. దీనివల్ల మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి మీ విషయాల్లో మీరే నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే మాత్రం సమస్యల బారిన పడతారు.
ఇతరులు మీకు ఉచిత సలహాలు ఇచ్చే ఛాన్స్ అయితే అందరికీ ఇవ్వద్దు. ఎవరితో అయినా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అన్ని విషయాలు షేర్ చేయండి. లేకపోతే అసలు చెప్పుకోవద్దు. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మవద్దు. ఎవరిని అయితే కూడా ఎంతవరకు హద్దుల్లో ఉంచితే అంతే మంచిది. మీకు సగం వరకు సమస్యలు ఉండవు. లేకపోతే మీరు ఎక్కువగా మళ్లీ సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి ఇతరులతో స్నేహం చేసేటప్పుడు తప్పకుండా అన్ని విషయాలు ఆలోచించి, వారి గురించి మీకు పూర్తి విషయాలు తెలిసిన తర్వాత మాత్రమే షేర్ చేసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:Pavan kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు.. పోలీసులు ఎందుకు నమోదు చేశారంటే?
-
Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?
-
Chanakyaniti: ఎలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు.. చాణక్య నీతి ఏం చెబుతోంది?
-
Divorce: విడాకులు కావాలంటే నెలకి 40 లక్షలు కావాలి.. స్టార్ హీరోకు అల్టిమేటం జారీ చేసిన భార్య
-
Coffee: కాఫీ ఆరోగ్యానికే కాదు.. తలకు కూడా మంచిదే!
-
Yellow: ఎల్లో కలర్ ఫేవరెట్.. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే?
-
Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే