Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Cibil Score Down If U Dont Get Loan

Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?

Cibil Score: లోన్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. కారణమేంటో తెలుసా?
  • Edited By: kusuma,
  • Updated on June 17, 2025 / 05:46 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Cibil Score: ఈ మధ్య కాలంలో చాలా మంది లోన్ తీసుకుంటున్నారు. ఎంత డబ్బు అవసరం ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో డబ్బులు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అయితే కొందరు లోన్ తీసుకుని సరిగ్గా కట్టకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. కానీ మరికొందరు అసలు లోన్ తీసుకోకపోయినా కూడా సిబిల్ స్కోర్ పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా లోన్ తీసుకుని దాని సమయం పూర్తి అయినా కూడా కట్టకపోతే సిబిల్ స్కో్ర్ పడిపోతుంది. అలాగే లిమిట్‌కి మించి లోన్ తీసుకున్న కూడా సిబిల్ స్కోర్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. సాధారణంగా ఒక్కో కార్డ్‌కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్‌కి తగ్గట్లుగా మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్న సరైన సమయానికి కట్టేయాలి. లేకపోతే మాత్రం సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అయితే లోన్ తీసుకోకపోయినా ఏయే సమయాల్లో సిబిల్ స్కోర్ తగ్గుతుంది? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

క్రెడిట్ రిపోర్ట్‌లో తప్పులు ఉండటం లేదా ఏదైనా తప్పుడు సమాచారం ఉండటం వల్ల కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. గుర్తు తెలియని క్రెడిట్ ఎంక్వైరీల వల్ల కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీరు ఎప్పుడూ లోన్ కోసం అప్లై చేయకపోయినా, ఎవరైనా మీ తరపున క్రెడిట్ కోసం అప్లై చేసి ఉండవచ్చు. లేదా ఏదైనా సంస్థ మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేసి ఉండవచ్చు. అలాగే మీ పాత క్రెడిట్ కార్డ్ అకౌంట్లను మూసి వేస్తే అది సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు జాయింట్ అకౌంట్ వల్ల కూడా వస్తుంది. జాయింట్ అకౌంట్ వల్ల మీతో ఉన్నవారు లోన్ ఏదైనా తీసుకుని దాన్ని సరైన సమయానికి కట్టకపోవడం వల్ల కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు

క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

క్రెడిట్ రిపోర్ట్‌ను ఏదైనా క్రెడిట్ బ్యూరో నుంచి తెలుసుకోవాలి. అయితే సంవత్సరానికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. అందులో ఏవైనా తప్పులు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి. క్రెడిట్ రిపోర్ట్‌లో ఏవైనా తప్పులు కనిపిస్తే, వెంటనే సంబంధిత క్రెడిట్ బ్యూరోకు తెలియజేసి వాటిని సరిచేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో 30% మించకుండా వాడటానికి ప్రయత్నించండి. మీకు రూ.1,00,000 లిమిట్ ఉంది అనుకోండి. మీరు దాన్ని రూ.30,000 మించకుండా వాడుకోవాలి. ఎక్కువ వాడుకుంటే స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ అకౌంట్లు ఎక్కువ కాలం ఓపెన్ చేసి ఉంచడం మంచిది. పాత అకౌంట్లను మూసివేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ తగ్గి స్కోర్ ప్రభావితం అవుతుంది.

ఇది కూడా చూడండి: WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..

Tag

  • CIBIL Score
  • Credit Card
  • Limits
  • Loan
  • personal loans
Related News
  • CIBIL Score: పెళ్లికి ముందు సిబిల్ స్కోర్‌ తప్పనిసరిగా చెక్‌ చేయాలా?

  • Credit Card: క్రెడిట్ కార్డు బిల్‌ను ఈఎంఐగా మార్చితే.. ఏమవుతుందో మీకు తెలుసా?

  • Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా.. ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి

  • Credit Card: క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివేట్ చేయడం ఎలా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us