WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..
WhatsApp's new changes: వాట్సప్.. ఈ మెసేజింగ్ యాప్ గురించి తెలియని వారు ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. సాధారణ మెసేజింగ్ యాప్ లాగా పరిచయమైన వాట్సాప్.. మనిషి జీవితంలో ఒక భాగంలాగా మారిపోయింది.

WhatsApp’s new changes: సందేశాలు, ఫోటోలు, వీడియోలు, గ్రాఫిక్ ఎమోజీలు, పిడిఎఫ్ ఫైల్స్, అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇలా చెప్పుకుంటూ పోతే వాట్సాప్ ద్వారా ఎన్నో పనులు సాగిపోతున్నాయి. లొకేషన్ షేరింగ్, గ్రూప్ కాలింగ్, గ్రూప్ వీడియో కాలింగ్.. ఇలా అనేక రకాలుగా మార్పులు చెందుకుంటూ వస్తోంది వాట్సప్. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న సోషల్ మెసేజింగ్ యాప్ గా వాట్సప్ పేరుపొందింది. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు వాట్స్అప్ ద్వారా గవర్నెన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ప్రజలకు సత్వరమే సేవలు అందిస్తూ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. అయితే ఇప్పటివరకు వాట్సప్ రకరకాల మార్పులకు గురవుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఇందులో ఊహించని మార్పులు కనిపిస్తాయని.. అవి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతాయని మెటా కంపెనీ చెబుతోంది.
సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వాట్సప్ లో తొలిసారిగా వాణిజ్య ప్రకటనలు వస్తాయట. ఇక వీటికి సంబంధించి అప్డేట్స్ ట్యాబ్ లో యాడ్స్ వస్తాయని మెటా సంస్థ ప్రకటించింది. అంతేకాదు చానల్స్ కు సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా వసూలు చేస్తామని మెటా ప్రకటించింది. ఫలితంగా ఇష్టపడే చానల్స్ నుంచి ప్రత్యేకమైన అప్డేట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారికి మద్దతు కూడా ఇవ్వచ్చని మెటా ప్రకటించింది. ఒక వ్యక్తిగత చాట్ ల విషయంలో ఎటువంటి మార్పులు చేయడం లేదని.. యాడ్స్ లేకుండా సందేశాలు, కాల్స్ యధాతధంగా కొనసాగించవచ్చని మెటా ప్రకటించింది..
Also Read: Cricket League Viral Video: ఇదెక్కడి క్యాచ్ రా మావా.. ఎప్పుడూ చూడలే.. ఇలా కూడా పడతారా.. వీడియో వైరల్
అయితే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. ఇందుకు వాట్సప్ కూడా మినహాయింపు కాదు. అయితే మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వాట్సాప్ లో కూడా ప్రకటనలు తీసుకురావాలని మెటా నిర్ణయించింది. ప్రపంచంలో అతిపెద్ద మెసేజింగ్ యాప్ గా వాట్సప్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఆర్జించుకోవాలని మెటా కంపెనీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..” ప్రపంచ వ్యాప్తంగా మందగమనం కొనసాగుతోంది. ఇది ఇప్పటిదాకా ఉంటుందో తెలియదు. ఆదాయం ఉంటేనే కంపెనీల మనుగడ సాగుతోంది. అందువల్లే మెటా కంపెనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎందుకంటే మెటా కంపెనీ వాట్సాప్ మీద భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇందులో మార్పులు చేర్పులకు నిత్యం కృషి చేస్తోంది. అతిపెద్ద వ్యవస్థను నిర్వహించాలి కాబట్టి మెటా కంపెనీ కూడా భారీగా లాభాలను ఆర్జించేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని” టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మెటా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి మెటా కంపెనీ ఇష్టపడకపోవచ్చని అంతర్జాతీయ మీడియా కధనాల ద్వారా తెలుస్తోంది.
-
WhatsApp : వాట్సాప్ స్పామ్ కాల్స్‌కు చెక్..మోసగాళ్ల బారిన పడకుండా ఇలా కాపాడుకోండి
-
Whatsapp AI: బోర్ కొడుతుందా.. వాట్సాప్‌లో ఏఐ ఫ్రెండ్‌తో ఇలా మాట్లాడండి
-
Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఇన్‌స్టాగ్రామ్ అయిపోయినట్లే
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్‌లో అద్భుతమైన ఫీచర్లు
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ పని అయిపోయినట్లేగా!