Whatsapp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. సబ్‌స్క్రిప్షన్ చేసుకునే వారికి స్పెషల్ కంటెంట్

Whatsapp New Feature: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తుంటుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. పర్సనల్ నుంచి ఆఫీస్ పనుల కోసం ఎక్కువగా ఈ వాట్సాప్‌ను వాడుతున్నారు. అసలు వాట్సాప్ లేకపోతే మాత్రం పనులు జరగవు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కూడా వాట్సాప్ వాడుతున్నారు. స్టేటస్, సాంగ్, వీడియో, ఆడియో కాల్‌లో ఫీచర్లు వంటివి ఎక్కువగా ఉన్నాయి. యూజర్ల కోసం వాట్సాప్ వీటిని ఎప్పుటికప్పుడు అప్డేట్ చేస్తుంది. కొత్త కొత్త అప్డేట్‌లను తీసుకొస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం మరో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మంచి కంటెంట్ వచ్చే విధంగా దీన్ని తీసుకొచ్చింది. అయితే కొత్తగా వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రస్తుతం వాట్సాప్‌లో ఛానల్స్ ఉన్నాయి. అయితే యూజర్లు వారికి నచ్చిన వారిని ఫాలో అవుతుంటారు. అయితే ఇప్పుడు యూజర్లు వారికి ఇష్టమైన వారిని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. కాకపోతే వీటికి ప్రతీ నెలా కూడా రుసుము చెల్లించాలి. అయితే ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకమైన కంటెంట్ వస్తుంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఛానల్ అడ్మిన్లకు రెగ్యులర్ సపోర్ట్ పొందవచ్చు. అలాగే మిగతా వారితో పోలిస్తే వీరికి సపరేట్ కంటెంట్ వస్తుంది. అలాగే కొత్త ఛానళ్లను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఛానల్‌కి ఉన్న అడ్మిన్లు వారి ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ సరికొత్త ఫీచర్ వల్ల ఛానల్స్, బిజినెస్ స్టేటస్ ట్యాబ్‌లో యాడ్స్ చూపించవచ్చు. అయితే దీనివల్ల యూజర్లకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాగంటే.. ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కు సంబంధించిన చాట్ ప్రారంభించవచ్చు. దీనికోసం యూజర్లకు మంచి అవకాశం లభిస్తుంది. అయితే ఇది బిజినెస్ కమ్యూనికేషన్ కోసం ప్రత్యేక అవకాశాలు కూడా ఇస్తుంది. అయితే ఇన్ని ఫీచర్లు ఇస్తుందని ప్రైవసీ లేదని అనుకోవచ్చు. కానీ వీటికి ప్రైవసీ కూడా ఉంది. మీరు ఇతరులకు పంపించే మెసేజ్‌లు, కాల్స్, స్టేటస్‌లు ఇలా అన్నింటికి కూడా ప్రైవసీ ఉంటుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ ఉంటుంది. ఎవరూ కూడా ఇతరుల ప్రైవసీని కూడా చూడలేరని మెటా తెలిపింది. మరి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఫీచర్లను వినియోగించుకోండి.
ఇది కూడా చూడండి: Kubera Full movie review: కుబేర ఫుల్ మూవీ రివ్యూ
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్