WhatsApp : వాట్సాప్ స్పామ్ కాల్స్‌కు చెక్..మోసగాళ్ల బారిన పడకుండా ఇలా కాపాడుకోండి

WhatsApp : ఈ రోజుల్లో వాట్సాప్‌లో స్పామ్, ఫ్రాడ్ కాల్స్ రావడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా విదేశీ నంబర్ల (ఉదాహరణకు: +234, +84, +62) నుంచి వచ్చే కాల్స్‌తో ప్రజలు మోసాలకు గురవుతున్నారు. కొందరు వ్యక్తులు ఈ మోసగాళ్ల వలలో పడి కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాట్సాప్ తన వినియోగదారుల సేఫ్టీ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. దీని ద్వారా మీరు ఈ స్పామ్ కాల్స్ నుంచి బయటపడవచ్చు. వాట్సాప్‌లో స్పామ్ కాల్స్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి.. మోసాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ వార్తలో తెలుసకుందాం.
స్పామ్ కాల్స్ అంటే తెలియని నంబర్ల నుంచి ముఖ్యంగా విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్. వీటిలో మీకు లాటరీ లేదా బహుమతులు గెలుచుకున్నారని నమ్మిస్తారు. కొందరు తమను ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటారు. వీడియో కాల్ చేసి బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని కూడా అడుగుతారు.
వాట్సాప్‌లో మీకు చాలా ప్రయోజనకరమైన ఫీచర్ అయిన ‘సైలెన్స్ అన్నోన్ కాలర్స్’ అందుబాటులో ఉంది. ఇది తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను రాకుండా చేస్తుంది. ఈ ఫీచర్ ఆన్ చేసినప్పుడు తెలియని నంబర్ నుంచి వచ్చే కాల్ మీ స్క్రీన్‌పై కనిపించదు. రింగ్ కూడా మోగదు.
Read Also:Kannappa : విడుదలకు ముందే కన్నప్ప ఓటీటీ రిలీజ్ కు డేట్ ఫీక్స్.. ఎప్పుడు వస్తుందంటే ?
ఈ కాల్ కేవలం మీ కాల్ లాగ్‌లో మాత్రమే కనిపిస్తుంది. తద్వారా మీరు కావాలంటే తర్వాత చూసుకోవచ్చు. దీనివల్ల మోసపూరిత కాల్స్ చేసే వారితో నేరుగా సంభాషించే అవసరం రాదు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడానికి ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం. దీన్ని పాలో అయి మీ ఫోనులో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. మోసాల నుండి బయటపడవచ్చు.
ఈ ఫీచర్‌ను ఇలా ఆన్ చేయండి
* వాట్సాప్ ఓపెన్ చేయాలి.
* పైన కుడి వైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ (Settings) లోకి వెళ్లండి.
* ఆ తర్వాత Privacy సెక్షన్‌లోకి వెళ్లి Calls పై క్లిక్ చేయాలి.
* ఇక్కడ మీకు Silence Unknown Callers ఆప్షన్ కనిపిస్తుంది. దాని టోగుల్‌ను ఆన్ చేయండి.
ఇప్పుడు మీకు ఏ తెలియని నంబర్ నుండి వచ్చే కాల్స్ కూడా ఇబ్బంది పెట్టవు. అవి వచ్చినా, వాటికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వాటిని మీ వీలును బట్టి చెక్ చేయవచ్చు. తిరిగి కాల్ చేయవచ్చు.
పొరపాటున కాల్ ఎత్తినట్లయితే వెంటనే కట్ చేయండి. ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయవద్దు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే, వెంటనే మీ దగ్గరలోని సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలి. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు వాట్సాప్ స్పామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాల నుండి సేఫ్ గా బయటపడవచ్చు.
Read Also:Allu Arjun : ఫాదర్స్ డే సర్ప్రైజ్.. పిల్లల గిఫ్ట్‌కు భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్!
-
Call Merging Scam : వెలుగులోకి కొత్త మోసం.. కాల్ మర్జింగ్ స్కామ్.. నిమిషాల్లో మీ డబ్బులు మాయం
-
Smartphones : వీవీఐపీలు వాడే ఫోన్లు ఏవో తెలుసా? వాటి ప్రత్యేకతలు వింటే షాకవుతారు!
-
Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఇన్‌స్టాగ్రామ్ అయిపోయినట్లే
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్
-
UPI : యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. మోసాలకు చెక్ పెట్టేలా కొత్త సిస్టమ్
-
Online Fraud : రూ. 10 వేల సోఫాను సెకండ్ హ్యాండ్లో అమ్మబోయి రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ఇంజనీర్