Call Merging Scam : వెలుగులోకి కొత్త మోసం.. కాల్ మర్జింగ్ స్కామ్.. నిమిషాల్లో మీ డబ్బులు మాయం

Call Merging Scam : మీరు ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) లేదా మరేదైనా మొబైల్ బ్యాంకింగ్ (Mobile Banking) వాడుతున్నారా.. అయితే జాగ్రత్త. ఇప్పుడు ఒక కొత్త మోసం వెలుగులోకి వచ్చింది, దీనిని ‘కాల్ మర్జింగ్ స్కామ్’ (Call Merging Scam) అని పిలుస్తున్నారు. ఈ మోసపూరిత పద్ధతి చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని సెకన్లలో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే కెపాసిటీ దీనికి ఉంది.
ఎలా జరుగుతుంది ఈ మోసం?
అపరిచితుడి నంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్ లో ఈ మోసం ప్రారంభం అవుతుంది. కాల్ చేసిన వ్యక్తి మీ స్నేహితుడు తమకు రెఫర్ చేశాడని, మీతో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని చెబుతాడు. మీరు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే మీకు మరొక మిస్డ్ కాల్ (Missed Call) వస్తుంది. అప్పుడు మొదటి లైన్లో ఉన్న వ్యక్తి మీ స్నేహితుడు కూడా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి, ముగ్గురూ కలిసి మాట్లాడుకోవడానికి కాల్‌లను కలపమని (Merge Calls) సూచిస్తాడు.
Read Also:Viral Video: భార్యాభర్తలు పాలు కాదు.. సిగరెట్ పంచుకోవాలి.. వైరలవుతున్న వీడియో
ఇది ప్రమాదకరం కాని అభ్యర్థనగా అనిపించవచ్చు, కానీ ఇక్కడే ప్రమాదం ఉంది. మీరు కాల్‌లను కలపగానే (Merge) సెకన్లలో లైన్ డిస్కనెక్ట్ (Disconnect) అవుతుంది. తెర వెనుక, మోసగాడు ఇప్పటికే మీ డిజిటల్ బ్యాంకింగ్ లేదా వాలెట్ వివరాలను ఉపయోగించి ఆర్థిక లావాదేవీని ప్రారంభించి ఉంటాడు. వారు ఓటీపీని వాయిస్ కాల్ ద్వారా పొందడానికి తెలివిగా ఎంచుకుంటారు. మీ కాల్ ఇప్పుడు మర్జ్ (Merged) చేయబడినందున, మీ మొబైల్ ప్రొవైడర్ బిగ్గరగా చదివే ఓటీపీని మోసగాడు వింటాడు. ఆ ఒక్క ఓటీపీతోనే వారు ట్రాన్సాక్షన్ పూర్తి చేసి మీ డబ్బులను కొట్టేస్తారు.
ఈ మోసం చాలా జాగ్రత్తగా పక్కా ప్లానింగుతో జరుగుతుంది. మోసగాడు ముందుగానే రెడీగా ఉంటాడు. మీ బ్యాంకింగ్ లేదా వాలెట్ సమాచారాన్ని సేకరిస్తాడు. లావాదేవీని మర్జ్ చేసిన కాల్‌తో సరిగ్గా సమయాన్ని కుదించుకుంటాడు. ఓటీపీని వినగానే, డబ్బు మాయం అవుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అపరిచితుల నంబర్ల నుండి వచ్చే కాల్లకు సమాధానం ఇవ్వడం మానుకోండి. ముఖ్యంగా మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లేదా ఏదైనా మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా తెలిస్తే తప్ప, కాల్‌లను ఎప్పుడూ మర్జ్ చేయవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా ఓటీపీలను ఎప్పుడూ కాల్లో బిగ్గరగా చెప్పవద్దు.
Read Also:APEAPCET: వచ్చేసిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతో ఇలా తెలుసుకోండి
-
UPI Circle : ఇక నుంచి పిల్లలు కూడా యూపీఐ చేయొచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది
-
UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త
-
Elon Musk : సూపర్ యాప్ గా మారబోతున్న .. మస్క్ X యాప్.. ఇక అన్నీ దాని నుంచేనట
-
WhatsApp : వాట్సాప్ స్పామ్ కాల్స్‌కు చెక్..మోసగాళ్ల బారిన పడకుండా ఇలా కాపాడుకోండి
-
Banking Frauds : సామాన్యులనే కాదు..బ్యాంకులనూ దోచేస్తున్న కేటుగాళ్లు..ఏడాదిలో 3రెట్లు పెరిగిన సైబర్ మోసాలు
-
UPI : యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. మోసాలకు చెక్ పెట్టేలా కొత్త సిస్టమ్