Viral Video: భార్యాభర్తలు పాలు కాదు.. సిగరెట్ పంచుకోవాలి.. వైరలవుతున్న వీడియో

Viral Video: ఈ డిజిటల్ యుగంలో డైలీ ఏదో ఒక చిన్న వీడియో లేదా ఫొటో అయిన నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని వైరల్ వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని మనుషులు ఇలా ఉన్నారు ఏంట్రా అనేలా చేస్తాయి. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు చేసిన పనిని చూసి చాలా మధ్య ఆశ్చర్య పడుతున్నారు. కాలం ఎలా మారిపోయిందని అంటున్నారు. భార్యాభర్తలు పాలు పంచుకోకుండా సిగరెట్ పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు సిగరెట్ తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటన చూసి ఒకోక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ఒక జంట బైక్‌పై ప్రయాణిస్తోంది. వెనుక కూర్చున్న భార్య సిగరెట్ తాగుతూ కనిపించింది. అంతేకాదు ఆమె సిగరెట్‌ను తన భర్తకు.. బైక్ నడుపుతుంటే నోట్లో పెట్టింది. ఈ దృశ్యాలు వెనుక నుంచి వస్తున్న వాహనదారులు తమ కెమెరాల్లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడటం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న తలెత్తుతోంది. కదులుతున్న బైక్‌పై సిగరెట్ తాగడం వల్ల డ్రైవర్ దృష్టి మరలి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పొగ లేదా బూడిద గాలికి ఎగిరి కళ్ళలోకి వెళ్లినా, అది వాహనం నడిపే వారికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. అంతేకాదు, పక్కన ఉన్న ఇతర వాహనదారులు లేదా పాద చారులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. సిగరెట్ వెలుగుతున్నప్పుడు గాలికి నిప్పు రవ్వలు ఎగిరి, పొరపాటున ఎవరిపైనా పడితే గాయాలు కావడమే కాకుండా, పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. ఇలాంటి చర్యలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతాయి. ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల వారి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై ఉన్న ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని కొందరు మండి పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వీడియోలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఇలా ఒకరిని చూసి ఇంకా ఎక్కువ మంది అలవాటు చేసుకుంటారని కామెంట్లు చేస్తున్నారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం