Kannappa : విడుదలకు ముందే కన్నప్ప ఓటీటీ రిలీజ్ కు డేట్ ఫీక్స్.. ఎప్పుడు వస్తుందంటే ?

Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’. మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో ప్రస్తుతం టీమ్ కన్నప్ప సినిమాను సౌత్, నార్త్ లో భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్ లోనూ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ జోరుగా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 12నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. మళ్లీ కొత్త తేదీని ప్రకటించి ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. అంతే కాకుండా ఈ చిత్రం ఓటీటీ రైట్స్ విషయంలోనూ మేకర్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓటీటీ డీల్ విషయంలో హీరో మంచు విష్ణు కండీషన్స్ ను పెట్టుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
‘కన్నప్ప’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా విడుదలైన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మంచు విష్ణు మంచు రెండు క్లాజులతో కూడిన డీల్‌కు ఒప్పుకున్నారు.మంచు కుటుంబం నుంచి వచ్చిన అన్ని సినిమాల్లోకి కన్నప్పనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం. ఈ సినిమాను చాలా ప్రస్టేజియస్ గా నిర్మించారు. ప్రస్తుతం రిలీజ్ కార్యక్రమాల్లో మోహన్ బాబు, మంచు విష్ణు ఫుల్ బిజీగా ఉన్నారు. అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ సినిమాను సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా నటిస్తుండడంతో అభిమానుల్లో భారీ హైప్ ఉంది. మరోవైపు టాప్ టెక్నీషియన్లు పని చేయడంతో మంచి అవుట్ పుట్ వచ్చినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది.
Read Also:Allu Arjun : ఫాదర్స్ డే సర్ప్రైజ్.. పిల్లల గిఫ్ట్‌కు భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్!
కన్నప్ప చిత్రాన్ని ఈ నెల 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ కన్నప్ప సినిమాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుందని మంచు విష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో ఒక నెల వరకు నడుస్తుంది. కానీ ఒప్పందం ప్రకారం.. ‘కన్నప్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన పొందితే అప్పుడు సినిమాను 8 వారాల తర్వాతే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి తీసుకొస్తారు. రెండో క్లాజ్ ప్రకారం, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేయకపోతే, అప్పుడు సినిమాను ఒక నెల తర్వాతే థియేటర్ల నుండి తొలగించి ఓటీటీలోకి తీసుకువస్తారు. కాబట్టి, సినిమా థియేట్రికల్ రన్ గరిష్టంగా 2 నెలల తర్వాత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుందని చెప్పవచ్చు.
Read Also:Kantara : ‘కాంతార’ షూటింగ్‌లో ప్రమాదం – చిత్ర యూనిట్‌కు నోటీసులు!
సినిమా థియేట్రికల్ విడుదల విషయానికి వస్తే, ‘కన్నప్ప’ జూన్ 27, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో, ప్రభాస్ నందీశ్వరుని పాత్రలో కనిపించనున్నారు. విష్ణు మంచు ఈ సినిమాలో కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించడంతో అభిమానులు ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు. సినిమా బడ్జెట్ విషయంలో విష్ణు మంచు ఎలాంటి రాజీ పడకుండా, దీన్ని సూపర్‌హిట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
-
Kannappa trailer: కన్నప్ప ట్రైలర్.. అంచనాలకు మించి ఉందా?
-
Prabhas :’ది రాజా సాబ్’ కోసం రూ.50కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్ ? అసలు కారణం ఇదే!
-
Big shock for Kannappa movie team: కన్నప్ప మూవీ టీంకు బిగ్ షాక్.. హార్డ్ వేర్ డ్రైవ్‌తో పరార్
-
Spirit Movie: ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన లక్కీ గర్ల్ త్రిప్తి డిమ్రీ
-
Manchu Vishnu: నాన్న కోసమే ఇదంతా చేస్తున్నా.. మంచు విష్ణుసంచలన నిజాలు
-
Salaar ReRelease : నెమ్మదించిన ‘సలార్’ రీ రిలీజ్ బుకింగ్స్..వచ్చిన గ్రాస్ ఇంతేనా?