Apps : మీ పర్సనల్ డేటాను దొంగిలిస్తున్న సోషల్ మీడియా యాప్స్.. టాప్‌లో Metaవే!

Apps : ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో మన ప్రైవసీకి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ ఆందోళనలను మరింత పెంచుతూ ఒక కొత్త నివేదిక బయటపడింది. Apteco అనే డేటా రీసెర్చ్ కంపెనీ చేసిన తాజా అధ్యయనంలో కొన్ని మొబైల్ యాప్‌లు వినియోగదారుల పర్సనల్ డేటాను భారీ స్థాయిలో సేకరిస్తున్నాయని తేలింది. అది కూడా వారి అనుమతి లేకుండానే చేస్తున్నాయని తేలింది. ఈ యాప్స్ జాబితాలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లే అగ్రస్థానంలో ఉన్నాయి.
Apteco 2024 నివేదిక ప్రకారం.. Meta కంపెనీకి చెందిన Facebook, Instagram, Threads యాప్‌లు అత్యధికంగా పర్సనల్ డేటాను సేకరిస్తున్న యాప్‌లలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ యాప్‌లు వినియోగదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, చిరునామాలు, అనేక ఇతర వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నాయి. వీటితో పాటు, LinkedIn, Pinterest, Amazon Alexa, Amazon, YouTube, X, PayPal కూడా ఈ టాప్ 10 జాబితాలో చేరాయి. ఈ యాప్స్‌కు మీ డేటాపై ఉన్న ఆసక్తి ఎంత ఎక్కువో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ యాప్‌లు కేవలం ప్రాథమిక వివరాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. అవి వినియోగదారుల డేటాను మరింత లోతుగా సేకరిస్తున్నాయి. అందులో ఇవి ఉన్నాయి. అవి లొకేషన్ డేటా , గుర్తింపుదారులు, పేమెంట్స్ హిస్టరీ, బ్రౌజింగ్ సెర్చ్ హిస్టరీ, కొనుగోళ్లకు సంబంధించిన రికార్డు లాంటివి కూడా సేకరిస్తున్నాయి. ఈ సమాచారం చాలాసార్లు కేవలం ప్రకటనలు చూపించడానికి మాత్రమే కాకుండా, వినియోగదారుల ప్రవర్తనను ట్రాక్ చేయడానికి, వారిని ప్రభావితం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఇది మన డిజిటల్ లైఫ్‌లో ఒక పెద్ద ప్రమాదం.
నివేదికలో యాప్‌లను డిలీట్ చేయమని చెప్పకపోయినా, వినియోగదారులకు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను తరచుగా తనిఖీ చేయాలని గట్టిగా సలహా ఇచ్చింది. లొకేషన్ యాక్సెస్‌ను “యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే” (While Using the App) కు పరిమితం చేయాలి. ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్‌ను నిలిపివేయాలి. కాంటాక్ట్‌లు, ఫోటోలు లేదా మైక్రోఫోన్ అనుమతులు చాలా అవసరమైతేనే ఇవ్వాలి. యాప్, ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి, మీ ప్రైవసీ సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.
Read Also: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు
ఆపిల్ “Data Linked to You” ప్రైవసీ లేబుల్ విధానం అమలులోకి వచ్చి నాలుగేళ్లు అయినప్పటికీ, యాప్‌లు వినియోగదారుల డేటాను అమ్మడం లేదా ఉపయోగించడం మానేయడం లేదు. వందల కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న ఈ యాప్‌లు, వారి వ్యక్తిగత సమాచారాన్ని ఒక ‘ప్రొడక్ట్’ లాగా ఉపయోగిస్తున్నాయి. ఇదంతా తెరవెనుక జరుగుతుంది. కాబట్టి, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత సమాచారం మీ పర్మీషన్ లేకుండా బయటి వారికి వెళ్లకుండా చూసుకోవాలి.
-
Instagram New Feature: ఇన్ స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్ విడుదల
-
Smartphone : ఫోన్లో ఎవరు ఏం చూశారో మొత్తం బయటపడుతుంది.. ఈ ట్రిక్ వెంటనే ట్రై చేయండి
-
Password Leak : 1600కోట్ల గూగుల్, యాపిల్ పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయట.. తస్మాత్ జాగ్రత్త
-
Viral Video : ఇంట్లోనే ఊటీ లాంటి చల్లదనం.. వైరల్ అవుతున్న రూఫ్‌టాప్ కూలర్
-
Abhishek bachchan: నాకోసం సమయం కేటాయించుకోవాలని ఉంది.. అభిషేక్ బచ్చన్ వైరల్ కామెంట్స్
-
Viral Video : నువ్వేం తండ్రివిరా నాయనా.. ఆ పిల్లాడిని సింహానికి ఆహారంగా వేద్దాం అనుకుంటున్నావా ?