Abhishek bachchan: నాకోసం సమయం కేటాయించుకోవాలని ఉంది.. అభిషేక్ బచ్చన్ వైరల్ కామెంట్స్

Abhishek bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ వారసుడిగా కాకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలకు తగ్గట్లుగానే వారి ప్రవర్తన కూడా ఉండేది. ఈవెంట్లు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఇద్దరూ కూడా వేర్వేరుగానే కనిపించారు. దీంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు? త్వరలోనే విడాకులు తీసుకుంటారని వార్తలు ఎక్కువగా వచ్చాయి. అయితే అలాంటిది ఏం లేదని వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంత సడెన్‌గా ఇలా పోస్ట్ పెట్టడం ఏంటని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. కొన్ని రోజులు అందరికి దూరంగా ఉండాలని, ఇలా ఎందుకు ఉండటం ఇష్టమని సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కొన్ని రోజులు అన్నింటికి కూడా దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. చుట్టూ జనం లేకుండా ఉంటే నన్ను నేను తెలుసుకోవచ్చని పోస్ట్‌లో తెలిపారు. ఇప్పటి వరకు నాకు ఇష్టమైన వారికోసం ఉన్నది అంతా కూడా ఇచ్చేశాను. ఇకనైనా కనీసం నాకోసం టైమ్ కేటాయించుకోవాలని అనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతానికి నన్ను నేను తెలుసుకోవడానికి నాకు కొంత సమయం కావాలని అభిషేక్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్లు చేశారు. మీరు ఏంటో తెలుసుకోవడానికి అందరికీ దూరంగా, ఒంటరిగా కొన్నిసార్లు ఉండాల్సిందేనని కామెంట్ చేశారు. మరికొందరు అసలు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇకపై అభిషేక్ సినిమాలు చేయరని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు ఇప్పటి వరకు చూసిన అభిషేక్ వేరు, ఇకపై కనిపించే అభిషేక్ వేరు అని కామెంట్లు చేస్తున్నారు. అసలు అభిషేక్ బచ్చన్ ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటో పూర్తిగా తెలియాల్సి ఉంది.
అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన ‘హౌస్‌ఫుల్ 5’ మూవీలో చివరిగా అభిషేక్ బచ్చన్ కనిపించారు. ఇందులో రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీని తరుణ్ దర్శకత్వం వహిచారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాగా హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం అభిషేక్ ‘రాజా శివాజీ’లో నటిస్తున్నారు. ఈ మూవీకి రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా
-
Manchu Manoj: మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ వేళ.. మనోజ్ ఆసక్తికర పోస్ట్!
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
-
Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!
-
Viral Video : మనుషుల కంటే ఆవులే బెటర్.. జాతీయగీతానికి నిలబడి గౌరవించిన గోమాత
-
Viral Video : ఇంట్లోనే ఊటీ లాంటి చల్లదనం.. వైరల్ అవుతున్న రూఫ్‌టాప్ కూలర్